Bloating Problem: తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉంటుందా.. వంటింట్లో ఉండే వీటిని ఉపయోగించండి..!

Stomach bloated after eating use these in the kitchen
x

Bloating Problem: తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉంటుందా.. వంటింట్లో ఉండే వీటిని ఉపయోగించండి..!

Highlights

Bloating Problem: కొంతమందికి తిన్న వెంటనే కడుపు ఉబ్బరంగా ఉంటుంది. నిలకడగా ఒకచోట కూర్చోలేరు. పొట్ట పట్టుకొని అటూ ఇటూ తిరుగుతూ ఇబ్బందిపడుతూ ఉంటారు.

Bloating Problem: కొంతమందికి తిన్న వెంటనే కడుపు ఉబ్బరంగా ఉంటుంది. నిలకడగా ఒకచోట కూర్చోలేరు. పొట్ట పట్టుకొని అటూ ఇటూ తిరుగుతూ ఇబ్బందిపడుతూ ఉంటారు. ఆయుర్వేద వైద్యుల ప్రకారం అన్ని వ్యాధులకు కారణం పొట్టే. ఇదొక్కటి క్లీన్‌గా ఉంటే ఎలాంటి వ్యాధులు దరిచేరవని చెబుతారు. మీరు పొట్టను ఆరోగ్యంగా ఉంచుకుంటే వ్యాధుల నుంచి సురక్షితంగా ఉంటారు. క్రమరహిత ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా కడుపు సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అయితే వంట్లింట్లో లభించే కొన్ని పదార్థాల ద్వారా ఉబ్బరాన్ని తగ్గించుకోవచ్చు. వాటి గురించి ఈరోజు లుసుకుందాం.

మీరు తరచుగా గ్యాస్, ఉబ్బరంతో ఇబ్బంది పడుతుంటే కొన్ని ఇంటి చిట్కాలను పాటించవచ్చు. జీలకర్రను మెత్తగా రుబ్బి, దానిలో నల్ల ఉప్పు కలపి ఆహారం తిన్న తర్వాత ఒక సిప్ నీటితో మింగాలి. దీని వల్ల ఉబ్బరం సమస్య తగ్గిపోతుంది. అయితే ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం మానేయాలి.

దాల్చిన చెక్క, పసుపు, నిమ్మకాయ

దాల్చిన చెక్క, పసుపు, నిమ్మకాయ ఉబ్బరం సమస్యను తగ్గిస్తాయి. ఇవి మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. బెల్లీ ఫ్యాట్‌ని తగ్గిస్తాయి. ఉబ్బరం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి. రోజూ పుదీనా టీ లేదా గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కూడా కడుపు ఉబ్బరం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి కడుపు ఉబ్బరం లేదా అపానవాయువు సమస్య ఉంటే నిపుణులు సూచించిన ఇంటి నివారణలను పాటించవచ్చు. దీని వల్ల తొందరగా ప్రయోజనం పొందుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories