Health Tips: వసంతకాలం వచ్చేసింది డైట్‌ మార్చండి.. ఈ సూపర్‌ఫుడ్స్‌ని చేర్చుకోండి..!

Spring is Here Change Your Diet Include These Superfoods
x

Health Tips: వసంతకాలం వచ్చేసింది డైట్‌ మార్చండి.. ఈ సూపర్‌ఫుడ్స్‌ని చేర్చుకోండి..!

Highlights

Health Tips: వసంతకాలం వచ్చేసింది. వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి.

Health Tips: వసంతకాలం వచ్చేసింది. వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. క్రమం తప్పకుండా వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అవసరం. ముఖ్యంగా కొన్నిరకాల సూపర్ ఫుడ్స్‌ని డైట్‌లో చేర్చుకోవాలి. ఇవి ఇన్ఫెక్షన్ల నుంచి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడుతాయి. అంతేకాదు వీటిలో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ సూపర్ ఫుడ్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి. దగ్గు, జలుబు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడానికి పనిచేస్తాయి.

మొలకలు

ఆహారంలో మొలకలను చేర్చుకోవచ్చు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. ఇందులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా మెగ్నీషియం, ఫాస్పరస్, మాంగనీస్, విటమిన్ కె కూడా లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల బ్యాక్టీరియా నుంచి రక్షించడానికి పనిచేస్తాయి.

విటమిన్ సి

ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి. ద్రాక్ష, ఆరెంజ్‌, నిమ్మ, జామ వంటి పండ్లు డైట్‌లో ఉండే విధంగా చూసుకోవాలి. ముఖ్యంగా సిట్రస్‌ జాతిపండ్లని ఎక్కువగా తీసుకోవాలి. వీటివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

పెరుగు

పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది ఫ్లూ నుంచి రక్షించడంలో దోహదపడుతుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది.

వెల్లుల్లి

వెల్లుల్లిలో అల్లిసిన్ అనే మూలకం ఉంటుంది. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడటానికి సహాయపడతాయి. జలుబు లేదా ఫ్లూ ప్రమాదం నుంచి రక్షింపబడుతారు.

బొప్పాయి

బొప్పాయిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. దీన్ని సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories