Spicy Tea: చలికాలంలో మసాల టీ.. అదిరిపోయే టేస్ట్ గురూ..

Spicy Tea in Winter It Has Many Health Benefits | Healthy Drinks
x

Spicy Tea: చలికాలంలో మసాల టీ.. అదిరిపోయే టేస్ట్ గురూ..

Highlights

Spicy Tea: కరోనా కాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి చాలామంది మసాల టీలను తాగారు...

Spicy Tea: కరోనా కాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి చాలామంది మసాల టీలను తాగారు. ఇందులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇప్పుడు చలికాలం వచ్చింది. దీంతో సీజనల్ వ్యాధులు మొదలవుతాయి. అందుకే మళ్లీ మసాల టీలని తాగితే శరీరం వెచ్చగా ఉండటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

ఉదయాన్నే ఒక కప్పు వేడి మసాలా టీ తాగడం వల్ల మీ శరీరానికి కావలసిన వెచ్చదనం లభిస్తుంది. దాల్చిన చెక్క, లవంగం, యాలకులు, జాజికాయ, కుంకుమపువ్వు, అల్లం వంటి సుగంధ ద్రవ్యాలు శరీరానికి తగినంత వేడిని అందిస్తాయి. ఇది జీవక్రియ మెరుగుపరిచి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉదయాన్నే, మధ్యాహ్నం భోజనం తర్వాత స్పైసీ టీని తాగితే మంచిది. ఇది అధిక కొవ్వు ఆహారాన్ని కూడా జీర్ణం చేస్తుంది.

ఉదయం పూట మసాలా టీ తాగడం వల్ల టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. మసాల టీలో జాజికాయ, దాల్చినచెక్క, ఏలకులు, పొడి అల్లం వంటి సుగంధ ద్రవ్యాలు, మూలికలు జోడించడం వల్ల రోగనిరోధక శక్తి పెంచుతుంది. ఇది ఫ్లూ, జ్వరం, కాలానుగుణ అలెర్జీలను తొలగిస్తుంది. మసాలా దినుసుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

టీలో మసాలా దినుసులు మిక్స్ చేసి ఉదయాన్నే సిప్ చేయడం వల్ల బరువు తగ్గుతారు. ఫెన్నెల్, లవంగాలు, దాల్చిన చెక్క, జాజికాయ వంటి సుగంధ ద్రవ్యాలు బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. అలాగే ఈ మసాలాలు కొవ్వును కాల్చడంలో, ఆకలిని తగ్గించడంలో సహాయపడతాయి. అదనంగా సుగంధ ద్రవ్యాలు, మూలికలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories