Health Tips: మోకాళ్ల నుంచి సౌండ్స్‌ రావడం ప్రమాదకరం.. పట్టించుకోకపోతే అంతే సంగతులు..!

Sounds Coming From the Knees are Dangerous
x

Health Tips: మోకాళ్ల నుంచి సౌండ్స్‌ రావడం ప్రమాదకరం.. పట్టించుకోకపోతే అంతే సంగతులు..!

Highlights

Health Tips: ఆహారం తీసుకోవడంలో అజాగ్రత్త, వ్యాయామం లేకపోవడం వల్ల యువతలో వ్యాధులు పెరుగుతున్నాయి.

Health Tips: ఆహారం తీసుకోవడంలో అజాగ్రత్త, వ్యాయామం లేకపోవడం వల్ల యువతలో వ్యాధులు పెరుగుతున్నాయి. వృద్ధాప్యంలో వచ్చే జబ్బులు చిన్నవయసులోనే వస్తున్నాయి. ముఖ్యంగా మోకాళ్ల నొప్పుల వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా దూరం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు ఈ నొప్పులు వేధిస్తాయి. చాలా సార్లు కూర్చొని లేచేటప్పుడు మోకాలి ఎముకల నుంచి శబ్దాలు వినిపిస్తాయి. దీనిని ప్రజలు విస్మరిస్తారు. కానీ ఇవి చాలా ప్రమాదకరం. ఇలా ఎందుకు జరుగుతుందో చికిత్స ఏంటో తెలుసుకుందాం.

మోకాళ్ల నుంచి వచ్చే శబ్దాన్ని పాటెల్లా కొండ్రోమలాసియా అంటారు. దీనివల్ల మోకాలి ముందు భాగంలో నొప్పి ఉంటుంది. మోకాలిచిప్ప ప్రోబింగ్ ఎముకపైకి వచ్చి ఆపై రుద్దడం ప్రారంభిస్తుంది. క్రీడాకారులు, యువతలో కొండ్రోమలేసియా పటేల్లా సమస్య ఉండటం సహజమేనని నిపుణులు చెబుతున్నారు. కీళ్లలో వాపులు, మోకాలులో శబ్దాలు, మోకాళ్ల సైడు నొప్పులు ఈ వ్యాధి లక్షణాలుగా చెప్పవచ్చు. వీటివల్ల నేలపై కూర్చోవడానికి, మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతారు.

కండరాల అసమతుల్యత, జంపింగ్ లేదా రన్నింగ్, మోకాలిచిప్పకు గాయం, వ్యాయామం చేయకపోవడం, ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. అందుకే ప్రతిరోజూ మోకాలి సంబంధిత వ్యాయామాలు చేయాలి. అయితే అకస్మాత్తుగా వర్కవుట్‌లు ప్రారంభించకూడదు. దీనివల్ల మోకాళ్ల సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్య ఎదురైనప్పుడు వైద్యుడిని సంప్రదించండం ఉత్తమం. కొందరు వ్యక్తులు MRI లేదా X-రే చేయించుకోవలసి ఉంటుంది. నొప్పి తీవ్రంగా ఉంటే మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేస్తారు. కానీ ఇది చాలా తక్కువ సందర్భాలలో జరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories