Health Tips: టీతో పాటు ఇవి తినవద్దు.. చాలా బాధపడుతారు..!

Some Foods Should not be Taken Along With Tea It Will Harm Health
x

Health Tips: టీతో పాటు ఇవి తినవద్దు.. చాలా బాధపడుతారు..!

Highlights

Health Tips: మనలో చాలా మందికి టీ తాగడమంటే ఇష్టం. కొందరికి కప్పు టీ లేకుంటే రోజు ప్రారంభం కాదు.

Health Tips: మనలో చాలా మందికి టీ తాగడమంటే ఇష్టం. కొందరికి కప్పు టీ లేకుంటే రోజు ప్రారంభం కాదు. గ్రామాల నుంచి మొదలుపెడితే నగరాల వరకు పదిమంది గుమిగూడే ఏ ప్రాంతమైన సరే అక్కడ టీ కొట్టు ఉంటుంది. అంతేకాదు దేశంలో నీటి తర్వాత అత్యధికంగా తాగే పానీయం టీనే. ఒక కప్పు టీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అయితే కొంతమంది టీతో పాటు అనేక రుచికరమైన స్నాక్స్‌ను ఆనందిస్తారు. అయితే టీతో పాటు కొన్ని పదార్థాలు తింటే ఆరోగ్యానికి హాని కలుగుతుందని మీకు తెలుసా.. వాటి గురించి తెలుసుకుందాం.

పకోడి

టీతో పాటు పకోడి తినకూడదు. దీనివల్ల జీర్ణక్రియ సమస్యలు ఎదురవుతాయి. ఎసిడిటీ సమస్య ప్రారంభమవుతుంది. ఛాతిలో మంటగా ఉంటుంది.

పసుపు ఆహారాలు

టీతో పాటుగా పసుపుతో చేసిన ఆహారాలు తినకూడదు. దీని వల్ల గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం సమస్యలు ఎదురవుతాయి. పసుపు, టీ ఆకుల కలయిక ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.

చల్లని పదార్థాలు

టీతో చల్లటి పదార్థాలు తినడం మంచిదికాదు. చల్లటి, వేడి కలయిక ఆరోగ్యానికి హానికరం. దీనివల్ల అజీర్తి సమస్య ఏర్పడుతుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియను అడ్డుకుంటుంది. వికారం, వాంతులు అనుభవిస్తారు. వేడి టీ తాగిన కొన్ని గంటల తర్వాత ఏదైనా తింటే మాత్రం పర్వాలేదు.

ఆకుపచ్చ కూరగాయలు

వేడి టీతో పాటు గ్రీన్ వెజిటేబుల్స్ తినడం మంచిదికాదు. టీలో టానిన్, ఆక్సలేట్ అనే మూలకం ఉంటుంది. ఇది శరీరం నుంచి ఇనుముని బయటికి పంపిస్తుంది.

లెమన్‌ టీ

చాలా మంది ఫిట్‌గా ఉండేందుకు లెమన్‌ టీ తాగుతుంటారు. దీనివల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుంది. నిజానికి నిమ్మకాయలో సిట్రస్ ఉంటుంది. ఇది ఛాతిలో మంటని, కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories