Soaked Almonds: నానబెట్టిన బాదం ఆరోగ్యానికి సూపర్ ఫుడ్‌..!

Soaked Almonds are a Super Food for Health
x

Soaked Almonds: నానబెట్టిన బాదం ఆరోగ్యానికి సూపర్ ఫుడ్‌..!

Highlights

Soaked Almonds: పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు తిన‌‌గ‌లిగే ఆహారంలో బాదం ప‌ప్పు ఒక‌టి.

Soaked Almonds: పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు తిన‌‌గ‌లిగే ఆహారంలో బాదం ప‌ప్పు ఒక‌టి. బాదంలో న్యూట్రీషియన్స్ , విటమిన్స్ , ఫైబర్, మెగ్నీషియం, ఓమేగా3 ఫ్యాటీయాసిడ్స్, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచి చేస్తాయి. బాదంను క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే బాదం ప్ర‌తి రోజు తిన‌డం వ‌ల్ల ఇన్సులిన్ స్థాయి అదుపులో ఉంటుంది.

ఇవి గ్లూకోజ్ ను శరీరం బాగా శోషించుకొనేలా చేస్తాయి. త‌ద్వారా మధుమేహం అదుపులో ఉంటుంది. వాస్త‌వానికి కొంద‌రు నాన‌బెట్టిన బాదం తింటే, మ‌రికొంద‌రు బాదంను డైరెక్ట్‌గా తింటారు. కానీ నానబెట్టిన బాదాం పప్పులు తినడమే ఆరోగ్యానికి మంచిది. బాదం పప్పుల మీద ఉండే తొక్కలో టానిన్ అనే పదార్ధం ఉంటుంది. అది మన శరీరం పోషకాలను గ్రహించకుండా చేస్తుంది. ఎప్పుడైతే బాదం పప్పులని నానబెట్టామో అప్పుడు ఆ తొక్క ఊడిపోతుంది. అలా తిన్న బాదం మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

అందులోనూ ముఖ్యంగా రాత్రి పూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇలా క్ర‌మం తప్ప‌కుండా బాదంను తిన‌డం వ‌ల్ల‌ జ్ఞాపకశక్తి మెరుగుప‌డుతుంది. ఇక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి బాదం ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. ఎందుకంటే బాదంలో ఉండే మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ కడుపునిండిన భావన కలిగిస్తుంది. ఈ క్ర‌మంలోనే ఆకలి తగ్గిస్తుంది. త‌ద్వారా బరువు త‌గ్గొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories