Earbuds Effect: రాత్రిపూట ఇయర్‌ బడ్స్‌ పెట్టుకొని నిద్రిస్తున్నారా.. పెద్ద పొరపాటు..!

Sleeping with Earbuds at Night can Cause Serious Damage to the Ears
x

Earbuds Effect: రాత్రిపూట ఇయర్‌ బడ్స్‌ పెట్టుకొని నిద్రిస్తున్నారా.. పెద్ద పొరపాటు..!

Highlights

Earbuds Effect: ఈ రోజుల్లో యువత ఏ పని చేస్తున్నా చెవిలో ఇయర్‌ బడ్స్‌ పెట్టుకొని మ్యూజిక్‌ వింటూ చేస్తున్నారు. ఇది కొన్ని సమయాల్లో మంచిదే అయినప్పటికీ అన్ని సమయాల్లో శ్రేయస్కరం కాదు.

Earbuds Effect: ఈ రోజుల్లో యువత ఏ పని చేస్తున్నా చెవిలో ఇయర్‌ బడ్స్‌ పెట్టుకొని మ్యూజిక్‌ వింటూ చేస్తున్నారు. ఇది కొన్ని సమయాల్లో మంచిదే అయినప్పటికీ అన్ని సమయాల్లో శ్రేయస్కరం కాదు. ముఖ్యంగా కొంతమంది అతి తెలివి ప్రదర్శించి నిద్రపోయేటప్పుడు కూడా చెవిలో ఇయర్‌ బడ్స్‌ పెట్టుకొని పాటలు వింటూ నిద్రిస్తున్నారు. ఇది చాలా ప్రమాదం ఇలా చేయడం వల్ల చెవులకి కలిగే నష్టాలేంటో ఈరోజు తెలుసుకుందాం.

వినే సామర్థ్యం కోల్పోతారు

రాత్రి మొత్తం ఇయర్‌ బడ్స్‌ పెట్టుకొని పాటలు వింటే ఆ వ్యక్తి వినే సామర్థ్యం కోల్పోతాడు. చెవులపై చాలా ఎఫెక్ట్‌ పడుతుంది. ప్రతిరోజు ఇలాచేస్తే మొదటగా చెవులలో నొప్పి ఏర్పడుతుంది. తర్వాత పూర్తిగా శబ్ధాలు వినే సామర్థ్యం కోల్పోతారు. చెవిటివారిగా మారుతారు.

చెవుల్లో శబ్దం

ఈ రోజుల్లో చాలా మంది ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్‌లను ఉపయోగిస్తున్నారు. ఇవి తెలియకుండానే ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయి. కొంతమంది ఇంటి నుంచి బయటికి వచ్చిన వెంటనే చెవిలో ఇయర్‌ బడ్స్‌ పెట్టుకుంటారు. నిరంతరం చెవుల్లో ఇయర్‌బడ్‌లను ఉంచుకుంటే చెవుల్లో తెలియని ఒక సౌండ్‌ వినపడుతూ ఉంటుంది. ఈ సమస్యకు చికిత్స లేదు. చివరికి చెవిటి వారిలా మారిపోతారు.

చెవులలో గుమిళి ఏర్పడటం

చెవులలో గుమిలి ఏర్పడటం సహజమైన ప్రక్రియ. కానీ ఒక వ్యక్తి చాలా కాలం పాటు ఇయర్‌బడ్‌లను ఉపయోగిస్తే చెవికి హాని కలుగుతుంది. దురద, పొడిబారిన సమస్య ఏర్పడుతాయి. గుమిలి సమస్య ఎక్కువవుతుంది. చెవులు చాలా నొప్పిగా తయారవుతాయి. ముట్టుకుంటే చాలు భరించలేని నొప్పి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories