Lifestyle: మీరు కూడా ఈ తప్పు చేస్తున్నారా? ఐతే త్వరగా ముసలివాళ్లు అవుతారు

Lifestyle: మీరు కూడా ఈ తప్పు చేస్తున్నారా? ఐతే త్వరగా ముసలివాళ్లు అవుతారు
x
Highlights

Side Effects of Sitting longer time: ప్రస్తుతం మనుషుల జీవన విధానం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు శారీరక శ్రమ ఎక్కువగా ఉండేది మానసిక ఒత్తిడి తక్కువగా...

Side Effects of Sitting longer time: ప్రస్తుతం మనుషుల జీవన విధానం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు శారీరక శ్రమ ఎక్కువగా ఉండేది మానసిక ఒత్తిడి తక్కువగా ఉండేది. కానీ ప్రస్తుతం మానసిక ఒత్తిడి ఎక్కువైంది శారీరక శ్రమ తగ్గింది. గంటల తరబడి కూర్చును పనిచేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పనిచేసే విధానం కూడా అలానే మారిపోయింది. గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఎలాంటి శారీరక శ్రమ లేకుండా గంటల తరబడి ఒకేచోట కూర్చోవడం వల్ల మరో సమస్య తప్పదని నిపుణులు చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గంటల తరబడి కదలకుండా కూర్చోవడం వల్ల త్వరగా వృద్ధాప్యం వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ కొలరాడో బౌల్డర్‌, యూనివర్సిటీ ఆప్‌ కాలిఫోర్నియా రివర్స్‌సైడ్‌కు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

ఇందుకోసం 28 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న వారిని ఎంచుకొని వారు వ్యాయామం చేస్తున్నారా లేదా? వారు ఎలా కూర్చుంటున్నారు? ఎంతసేపు కూర్చుంటున్నారన్న వివరాలను సేకరించారు. వీరిలో ఎక్కువమంది 9 నుంచి 16 గంటలపాటు కదలకుండా కూర్చునే ఉంటున్నారని తేలింది. అలాగే ఇంకొందరైతే ఏకంగా వారానికి 60 గంటలు కూడా కదలకుండా ఉంటున్నారని పరిశోధనల్లో వెల్లడైంది.

అయితే ఎక్కువ సేపు కూర్చంటున్నాం కదా అని ఏదో పేరుకు కొద్దిసేపు వ్యాయామం చేస్తే సరిపోదని పరిశోధకులు చెబుతున్నారు. కచ్చితంగా రోజులో 30 నుంచి 45 నిమిషాల్లో వాకింగ్ లేదా ఏదో ఒక పద్ధతిలో వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. అలాగే కనీసం రెండు గంటలకు ఒకసారైనా లేచి ఒక వంద అడుగులైనా వేయాలని చెబుతున్నారు. లేదంటే నడుం చుట్టు కొవ్వు పేరుకుపోవడం, గుండె సంబంధిత సమస్యలు రావవడం, త్వరగా వృద్ధాప్యం బారిన పడడం వంటి సమస్యలు తప్పవని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories