Relationship: భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గే సూచనలు ఇవే.!

Relationship: భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గే సూచనలు ఇవే.!
x

Relationship: భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గే సూచనలు ఇవే.!

Highlights

Relationship: భార్యభర్తల మధ్య చిన్న చిన్న గొడవలే కాదు..పెద్ద గొడవలు వచ్చినా సరే..వారి బంధం పదిలంగా ఉండాలంటే సర్ధుకుపోయే గుణం ఉండాలి.

Relationship: వ్యక్తిగత సంబంధాలు చాలా సున్నితమైనవి. నేటికాలంలో చాలా మంది దంపతులు చిన్న చిన్న విషయాలకే గొడవపడి విడాకులు తీసుకుంటున్నారు. వారి బంధంలో ఏమాత్రం ఇబ్బందిగా ఉన్నా విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. కొన్ని జంటలు కలిసి ఉన్నప్పటికీ వారి మధ్య ఆకర్షణ, ప్రేమ మాత్రం ఉండదు. ఏవేవో చిన్న విషయాలను మనస్సులో పెట్టుకుని సంబంధాన్ని తెంచుకునే పరిస్థితులు కల్పించుకుంటున్నారని నిపుణులు అంటున్నారు.

అయితే మీ భాగస్వామి వేరొకరి ప్రేమ, సంబంధంలో పాలుపంచుకుంటున్నారని తెలిపే సూచనలు ఉండవచ్చు. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. దీనికి కారణాలు చాలానే ఉండవచ్చు. అవేంటో తెలుసుకోవడం కూడా ముఖ్యం.

శారీరకంగా దూరమవ్వడం:

భాగస్వాములు ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గిందనడానికి సూచన శారీరకంగా దూరంగా ఉండట. మీ భాగస్వామి మీతో ఏకాంతంగా గడిపేందుకు ఇష్టపడనట్లయితే..మీరు కాస్త ఆలోచించాలంటున్నారు నిపుణులు. కలిసి బయటకు వెళ్లడం, రెస్టారెంట్ కు వెళ్లడం తగ్గిస్తుంటారు. అతను కానీ ఆమె కానీ ఉద్దేశపూర్వంగా భౌతికంగా దూరంగా ఉంటున్నట్లయితే మీపై ప్రేమ తగ్గుతుందని చెప్పవచ్చు.

పట్టించుకోకపోవడం:

మీరిద్దరూ కలిసి నాణ్యమైన సమయాన్ని గడపకపోడం కూడా ఒక సూచన. మీ భాగస్వామి ఆమె లేదా అతను స్నేహితులను బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారంటే మిమ్మల్ని దూరం పెడుతున్నట్లు అర్థం. ఇద్దరి మధ్య ఫోన్ కాల్స్, మెసేజ్ లు రోజు రోజు తగ్గుతాయి. కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నామనే భావన కలుగుతుంది.

భవిష్యత్తుపై చర్చ:

భార్యభర్తలు కలిసి భవిష్యత్తు గురించి చర్చించుకుంటారు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటారు. కానీ మీ భాగస్వామి ఇవేవీ పట్టించుకోనట్లు అనిపిస్తే వారిలో మార్పును గమనించవచ్చు. పెళ్లైన కొత్తలో మీకు ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పుడు ఇవ్వడం లేదంటే..మీ భాగస్వామిలో వేరే ఆలోచనలు ఉన్నట్లు అర్థం చేసుకోవాలని నిపుణులు అంటున్నారు.

ఎప్పుడూ కోపంగా:

భార్యభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు సాధారణమే. కానీ ఈ గొడవలు సంబంధానికి హానికలిగించకూడదు. కానీ మీ భాగస్వామి మీపై ఎప్పుడూ కోపంగా ఉంటే అది ప్రమాదకరం. తప్పు ఉన్నా లేకపోయినా మీపై కోపం చూపిస్తుంటే మీరంటే ఇష్టం తగ్గుతుందని భావించాలి. ప్రతీసారి కోపం, అసభ్యకరంగా ప్రవర్తించడం, మీ మాట లెక్కచేయకపోవడం, ప్రతి విషయంలోనూ తప్పులు చూపడం ఇవన్నీ మీపై ఆసక్తి లేదనడానికి నిదర్శనం.

ఈ విషయాలు తెలుసుకోవడం ముఖ్యం:

భార్యభర్తల సంబంధంలో కోపతాపాలు సాధారణం. ఒకరినొకరు అర్థం చేసుకుని..ముందుకు వెళ్తేనే ఎలాంటి సమస్యలు లేకుండా బండి ముందుకు సాగుతుంది. లేదంటే బంధం ఎక్కువ కాలం నిలవదు. జీవితంలో ఆత్మగౌరవం కంటే ఏదీ ముఖ్యమైంది కాదు. ఆనందం, సంతోషం, ప్రేమ అనేది మీ చేతుల్లో ఉంటుంది. మిమ్మల్ని గౌరవించని వ్యక్తిని ప్రేమించడం వ్యర్థం.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories