ప్యాంటు వెనుక జేబులో పర్సు పెట్టుకుంటున్నారా.. ఈ దుష్ప్రభావాలు తెలిస్తే అలాంటి తప్పు చేయరు..!

Side Effects of Keeping a Purse in the Back Pocket of Pants
x

ప్యాంటు వెనుక జేబులో పర్సు పెట్టుకుంటున్నారా.. ఈ దుష్ప్రభావాలు తెలిస్తే అలాంటి తప్పు చేయరు..!

Highlights

Health Tips: పురుషులు సాధారణంగా పర్సుని ప్యాంటు వెనుక జేబులో పెట్టుకుంటారు.

Health Tips: పురుషులు సాధారణంగా పర్సుని ప్యాంటు వెనుక జేబులో పెట్టుకుంటారు. అందులో డబ్బుతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, డెబిట్ కార్డ్, ఆధార్‌ కార్డు సహా చాలా ముఖ్యమైన డాక్యుమెంట్లు ఉంటాయి. అయితే దీనివల్ల మగవారు 'ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్' అనే తీవ్రమైన వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. ఈ వ్యాధి కారణంగా వారు లేచి నడవడానికి కూడా చాలా ఇబ్బందిపడుతారు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

వైద్యులు ప్రకారం పురుషులు సాధారణంగా తమ పర్సులో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డెబిట్ కార్డ్ వంటి ముఖ్యమైన వస్తువులను ఉంచుకుంటారు. దీని కారణంగా వారి వాలెట్ చాలా బరువుగా మారుతుంది. దీని కారణంగా వెన్నుపాము నుంచి కాలి వరకు వెళ్ళే తుంటి అనగా తొడ వెనుక భాగపు నరాల మీద ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల తల పైనుంచి కింది బొటనవేలు వరకు నొప్పి ఏర్పడుతుంది.

ఒక వ్యక్తి తన వెనుక జేబులో బరువైన పర్సును ఉంచుకుని నిరంతరం చాలా గంటలు పని చేయడం వల్ల వెనుక భాగంలో తిమ్మిరి వస్తుంది. ఆఫీస్‌లో ఎక్కువ గంటలు కూర్చోవడం, దూర ప్రయాణాలు చేయడం, వాహనాలు నడిపినప్పుడు చాలా సమస్యలు ఎదురవుతాయి. ఇలా చేయడం వల్ల శరీర సమతుల్యత దెబ్బతింటుంది. దీని వల్ల నడకలో ఇబ్బంది మొదలవుతుంది. దీంతోపాటు తుంటి అనగా తొడ వెనుక భాగపు నరములు ఒత్తిడికి గురవుతాయి. తరచుగా నడుము, తుంటిలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. దీని కారణంగా రక్త ప్రసరణలో అవరోధం కొన్నిసార్లు సిరల్లో వాపు ఏర్పడుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories