Health: పాలు ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా తాగుతున్నారా? ఏమవుతుందో తెలుసా?

Health: పాలు ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా తాగుతున్నారా? ఏమవుతుందో తెలుసా?
x
Highlights

Health: పాలు ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా తాగుతున్నారా? ఏమవుతుందో తెలుసా? పాలను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

Drinking excess milk: మనిషికి సంపూర్ణ పోషణ లభించాలంటే పాలు కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు కచ్చితంగా పాలను తీసుకోవాలని సూచిస్తుంటారు. పాలలో ఉండే ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పొటాషియం, కాల్షియం, పొటాషియం, మెగ్నీషయం, విటమిన్‌ డి, బి 12 వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిసిందే. ఎముకలను దృఢంగా మార్చడంలో పాలు కీలక పాత్ర పోషిస్తాయి.

అందుకే చిన్న పిల్లలకు కచ్చితంగా పాలను ఇవ్వాలని నిపుణులు చెబుతుంటారు. అయితే ఆరోగ్యానికి పాలు మంచివని ఎక్కువగా తాగితే మాత్రం సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ పాలను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

పాలు ఎక్కువగా తీసుకుంటే వచ్చే సమస్యల్లో జీర్ణ సంబంధిత సమస్యలు ప్రధానమైనవి. ముఖ్యంగా పాలను మోతాదుకు మించి తీసుకుంటే తిమ్మిరి, కడుపుబ్బరం, అజీర్ణం, అతిసారం వంటి సమస్యలు తప్పవని అంటున్నారు. అందుకే పాలను మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. మోతాదుకు మించి పాలను తాగితే పేగు సిండ్రోమ్‌ సమస్య వస్తుంది. ఈ కారణంగా శరీరం నీరసంగా మారుతుంది, అలసట పెరుగుతుంది.

పాలను పరిమితికి మించి తీసుకుంటే తలనొప్పి సమస్య వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొందరిలో చర్మ సంబంధిత సమస్యలు కూడా వస్తాయంటున్నారు. ముఖ్యంగా ముఖంపై మొటిమలు, మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది. పాలలో కేలరీలు కూడా అధికంగా ఉంటాయి. ఇది బరువు పెరగడానికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక పాలను ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఐరన్‌ లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. పాలు శరీరంలో ఐరన్‌‌ను అబ్‌జర్వ్ చేసుకోవడంలో ఆటంకం కలిగిస్తుంది. ఇది రక్తహీనత సమస్యకు దారి తీసే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories