Sweet Potato: చిలకడదుంపలు తింటే కలిగే మేలేంటో తెలుసా?

Sweet Potatoes Help Maintain Stress Levels
x

Sweet పొటాటో:(ఫైల్ ఇమేజ్)

Highlights

Sweet Potato: మనిషి ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు చిలకడదుంపలు ఉపయోగపడుతాయి.

Sweet Potato: చాలా మంది అస్సలు దుంపలు కూరగాయలు తినాలా వద్దా అనే మీమాంస చాలా మందిలో వుంటుంది. కానీ చిలకడదుంపను నిర్భ్యంతరంగా తీసుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చిలగడదుంప (Sweet Potato) ఈ దుంపలకు ఒక్కో ప్రదేశంలో ఒక్కో పేరుతో కూడా పిలుస్తారు. పిండి పదార్థాలను, చక్కెరలను కలిగి ఉండే ఈ ఆహార పదార్థం రుచిని కూడా కలిగి ఉంటుంది. వివిధ రకాలుగా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇందులో ఉన్నన్ని అద్భుతమైన పోషకాలు తెలిస్తే ఎవరూ దానిని వదిలిపెట్టరు. మరి ఇందులో వుండే పోషకాలు మనకు ఎలా ఉపయోగపడతాయో మన "లైఫ్ స్టైల్" లో చూద్దాం.

చిలకడ దుంపను పులుసు, వేపుడు, ఉడక పెట్టడం, నిప్పుల పై కాల్చి తీసుకుంటూ వుంటారు. అన్నింటి కన్నా కాల్చుకుని తింటే దాని రుచే వేరుగా వుంటుంది. చిలకడ దుంప, శరీర రక్తంలో తెల్ల రక్తకణాలను మరియు ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని అధికం చేసి, ఒత్తిడిని తగ్గిస్తుంది. చిలకడ దుంప, విటమిన్ 'డి'ని పుష్కలంగా కలిగి ఉండటం వలన రోగనిరోధక శక్తిని మెరుగుపరచి, మానసిక కల్లోలాలను తగ్గించి, శక్తిని పెంచి, ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది.

గుండె కండరాలు బలంగా ఉండేలా నిర్మిస్తుంది. చిలకడదుంప పుష్కలమైన విటమిన్ 'సి' కలిగి ఉండి, జలుబు మరియు ఫ్లూలను తగ్గించటమే కాకుండా, దంతాలు, ఎముకల ఏర్పాటు, రక్త కణాల మరియు కొల్లజన్ ఉత్పత్తిలను పెంచుతుంది. కొల్లాజన్ చర్మ కణాలకు స్టితిస్థాపకతను చేకూర్చి ఒత్తిడి మరియు క్యాన్సర్ వ్యాధిని కలుగచేసే కారకాల చర్యలను అడ్డుకుంటుంది.

చిలకడదుంప పొటాషియంను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఇది హృదయ స్పందన మరియు నరాల సంకేతాలను నియంత్రిస్తుంది. మూత్రపిండాల వ్యాధులు, వాపులు, కండరాల తిమ్మిరులను పొటాషియం తగ్గిస్తుంది. పొట్టలో ఏర్పడే అల్సర్‌లను తగ్గించి వేస్తాయి. ఫైబర్లను అధిక మొత్తంలో కలిగి ఉన్న, ఈ పిండి పదార్థాలతో కూడిన ఆహారం, అసిడిటీ సమస్యలను మరియు మలబద్దకం వంటి వాటిని కలుగకుండా చూస్తాయి.

విటమిన్ 'ఎ', యాంటీ క్యాన్సర్ గుణాలను కలిగి ఉండి, క్యాన్సర్ కలుగచేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేయటమే కాకుండా ఈ దుంపలలోని అతినీలలోహిత కిరణాల వలన కలిగే ప్రమాదాల నుండి, మరియు వీటి వలన ప్రమాదానికి గురైన కణాలను భర్తీ చేయటానికి ఈ విటమిన్ సహాయపడుతుంది. చిలగడదుంపల్లో విటమిన్‌ బీ6 ఎక్కువ గా ఉంటుంది. రక్తనాళాలు బలంగా ఉండేందుకు తోడ్పడే హోమోసిస్టీన్‌ను మరియు విటమిన్‌ బీ6 విడగొడుతుంది. అందువల్ల వీటితో గుండె, రక్తనాళాల సమస్యలు దూరంగా ఉంటాయి. సో తెలుసుకున్నారుగా చిలకడదుంపల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి. ఇక ఇప్పటి నుంచి మీ ఆహార పదార్థాల్లో చిలకడదుంపను కూడా ఓ భాగంగా మలుచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories