Beauty Tips: నువ్వులతో ఆరోగ్యమే కాదు, అందం కూడా.. ఏం చేయాలంటే..!

Sesame Seeds Used for Glowing Skin
x

Beauty Tips: నువ్వులతో ఆరోగ్యమే కాదు, అందం కూడా.. ఏం చేయాలంటే..!

Highlights

Sesame Seeds: నువ్వులు.. వంటింట్లో కచ్చితంగా ఉండే పదార్థాల్లో ఇవీ ఒకటి. నువ్వుల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిందే.

Sesame Seeds: నువ్వులు.. వంటింట్లో కచ్చితంగా ఉండే పదార్థాల్లో ఇవీ ఒకటి. నువ్వుల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిందే. అయితే నువ్వులు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, అందానికి కూడా ఉపయోగపడుతుందని మీకు తెలుసా.? నువ్వులు అందానికి ఎలా ఉపయోగపడతాయనే ఆలోచిస్తున్నారు కదూ! అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

ఆరోగ్యామే కాకుండా నువ్వులు చర్మ అందాన్ని కాపాడాడంలో కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నువ్వుల్లోని యాంటీఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి ఉపయోగపడతాయి. అలాగే చర్మంపై ఉండే మృత కణాలను తొలగించడంలో సహాయపడుతాయి. అలాగే సూర్యుడి కిరణాల నుంచి కూడా చర్మాన్ని సంరక్షించడంలో నువ్వులు కీలక పాత్ర పోషిస్తాయి. నువ్వులను ఆహారంలో భాగం చేసుకున్నా చర్మంపై ఉండే ముడతలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ ఇ, బి6, మెగ్నీషియం వంటి పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

అంతేకాకుండా నువ్వుల్లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ముఖంపై ఏర్పడే వాపులను తగ్గిస్తాయి. మొటిమలు, తామర వంటి సమస్యలను దరిచేరకుండా చస్తాయి. ఇక నువ్వుల నూనె మంచి మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడుతుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో ఉపయోగపడుతుంది. చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మార్చడంలో కూడా సహాయపడుతుంది. ప్రతిరోజూ పడుకునే ముందు నువ్వుల నూనెను ముఖంపై సున్నితంగా మసాజ్ చేస్తే, కొద్ది రోజుల్లోనే దాని ప్రభావం కనిపిస్తుంది.

ఇక నువ్వులతో ఫేస్‌కి స్క్రబ్‌ కూడా చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు, ఒక చెంచా పెరుగు, ఒక చెంచా తేనె కలిపి పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్‌ను మీ ముఖానికి అప్లై చేసి 5 నిమిషాల పాటు ముఖాన్ని సున్నితంగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవడం వల్ల డెడ్ స్కిన్ తొలగిపోయి చర్మం మెరిసిపోతుంది. ఇక నువ్వుల పొడి కూడా సహజ క్లెన్సర్‌గా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ నువ్వుల పొడిని ఒక టీస్పూన్ శెనగపిండి, కొద్దిగా నీరు కలిపి పేస్ట్‌లో తయారు చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి 10 నిమిషాలు ఉంచి, తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories