Health Tips: షుగర్‌ పేషెంట్లకి ఈ తియ్యటి పండు బెస్ట్.. ఎటువంటి హాని ఉండదు..!

Seethaphalam Custard Apple is Best for Diabetic Patients it Does not Cause any Harm to Health
x

Health Tips: షుగర్‌ పేషెంట్లకి ఈ తియ్యటి పండు బెస్ట్.. ఎటువంటి హాని ఉండదు..!

Highlights

Health Tips: భారతదేశంలో షుగర్‌ పేషెంట్లు రోజు రోజుకి పెరిగిపోతున్నారు.

Health Tips: భారతదేశంలో షుగర్‌ పేషెంట్లు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. ఇది ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం వదిలిపెట్టదు. ఇప్పటివరకు శాస్ర్తవేత్తలు కూడా దీనికి గట్టి మందు కనుగొనలేకపోతున్నారు. ఈ పరిస్థితిలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాస్తవానికి మధుమేహ రోగులు తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. మామిడి, పైనాపిల్ వంటి తీపి పండ్లు కూడా తినకూడదు. అయితే డయాబెటిక్ పేషెంట్లకు కూడా హాని చేయని తియ్యటి పండు ఒకటి ఉంది. దాని గురించి ఈరోజు తెలుసుకుందాం.

సీతాఫలం షుగర్‌ పేషెంట్లకి ఎటువంటి హాని చేయదు. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. అందుకే అందరిని ఆకర్షిస్తుంది. ఇంగ్లీషులో దీనిని కస్టర్డ్ యాపిల్ అని పిలుస్తారు. ఈ పండుని తినాలంటే ముందుగా తొక్కని తీసివేసి తెల్లటి గుజ్జులో ఉండే గింజలు తీసివేసి తినాల్సి ఉంటుంది. అయినప్పటికీ దీని రుచి అందరికి నచ్చుతుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, కాపర్, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. పోషకాల పవర్‌హౌస్‌గా చెప్పవచ్చు.

సీతాఫలం విటమిన్ B6కి గొప్ప మూలమని చెప్పవచ్చు. ఇది ఉబ్బరం, PMS చికిత్సలో సహాయపడుతుంది . ఈ పండులో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రిస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా సీతాఫలం తినాలి ఎందుకంటే ఇది వారి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. సీతాఫలంలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. దీనిని తినడం వల్ల చాలా సమయం వరకు కడుపు నిండిన భావన ఉంటుంది. దీనివల్ల మీరు అతిగా తినకుండా ఉంటారు. దీంతో సులువుగా బరువు తగ్గుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories