Viral Infection: వర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్ ప్రమాదం ఎక్కువ.. ఇవి డైట్‌లో ఉంటే ఎలాంటి సమస్య ఉండదు..!

Risk Of Viral Infection Is High During Rainy Season There Is No Problem If These Foods Are Included In The Diet
x

Viral Infection: వర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్ ప్రమాదం ఎక్కువ.. ఇవి డైట్‌లో ఉంటే ఎలాంటి సమస్య ఉండదు..!

Highlights

Viral Infection: వర్షాకాలంలో వైరల్‌ ఇన్ఫెక్షన్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలామంది జలుబు, దగ్గు, ముక్కు కారటం, జ్వరాలకి గురవుతారు. వీటివల్ల చాల బలహీనంగా మారుతారు.

Viral Infection: వర్షాకాలంలో వైరల్‌ ఇన్ఫెక్షన్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలామంది జలుబు, దగ్గు, ముక్కు కారటం, జ్వరాలకి గురవుతారు. వీటివల్ల చాల బలహీనంగా మారుతారు. అందుకే ముందుగా వైరల్‌ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి. ఇందుకోసం రోజు తినే ఆహారంలో కొన్ని రకాల పదార్థాలు ఉండాలి. ఇవి వైరల్‌ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతాయి. అలాంటి వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

ప్రొటీన్ రిచ్ డైట్

వైరల్ ఇన్ఫెక్షన్ సమయంలో ప్రోటీన్ కలిగి ఉన్న వాటిని అధికంగా తినాలి. ఇది శరీరాన్ని బలపరుస్తుంది. కానీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుడ్లు, మాంసం తినడం వల్ల ప్రొటీన్స్‌ ఎక్కువగా లభిస్తాయి. ఒకవేళ శాఖాహారులైతే పప్పులు, పాలు, శనగలు, సోయాబీన్ తీసుకోవచ్చు.

పండ్లు, కూరగాయలు

తాజా పండ్లు, కూరగాయలు ఎల్లప్పుడూ ఆరోగ్యానికి మంచివే. ఎందుకంటే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహకరిస్తాయి. బచ్చలికూర, బ్రోకలీ, క్యారెట్, నారింజ, నిమ్మకాయ, క్యాబేజీ వంటి వాటిని తప్పనిసరిగా తీసుకోవాలి.

నీరు

ఇన్ఫెక్షన్ ప్రభావం తక్కువగా ఉండాలంటే శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. కాబట్టి తరచుగా నీరు తాగుతూ ఉండాలి. శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉంటే వైరల్ ఫీవర్ వంటి వ్యాధులు త్వరగా నయమవుతాయి.

పసుపు పాలు

వేడి పాలలో పసుపు కలయిక ఆయుర్వేద ఔషధం కంటే తక్కువేమి కాదు. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా శరీర భాగాలకు ఎటువంటి హాని కలిగించదు.

Show Full Article
Print Article
Next Story
More Stories