High Cholesterol: ఈ లక్షణాలు కనిపిస్తే అధిక కొలస్ట్రాల్ అని గుర్తించండి.. అవేంటంటే..?

Risk of High Cholesterol if These Symptoms Appear
x

High Cholesterol: ఈ లక్షణాలు కనిపిస్తే అధిక కొలస్ట్రాల్ అని గుర్తించండి.. అవేంటంటే..?

Highlights

High Cholesterol: ఈ లక్షణాలు కనిపిస్తే అధిక కొలస్ట్రాల్ అని గుర్తించండి.. అవేంటంటే..?

High Cholesterol: ప్రస్తుతం చెడు జీవనశైలి కారణంగా గుండె, మెదడు, మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. పెరుగుతున్న కొలెస్ట్రాల్ గురించి చాలా మంది యువత ఆందోళన చెందుతున్నారు. కొలెస్ట్రాల్ పెరగడం ఆరోగ్యానికి హానికరం అని అందరికి తెలిసిందే. 25 నుంచి 35 ఏళ్ల యువతలో ఈ లక్షణాలు కనిపిస్తే అది అధిక కొలెస్ట్రాల్ సమస్య అని గుర్తించండి. ఆ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

విశ్రాంతి లేకపోవడం, చెమట పట్టడం

ఒక వ్యక్తికి చెమట పట్టినట్లు అనిపించినప్పుడు, అది కొలెస్ట్రాల్‌ను పెంచే లక్షణం అయి ఉంటుంది. రక్తం తగినంత పరిమాణంలో గుండెకు చేరుకోనప్పుడు, గుండె తక్కువ రక్తాన్ని పంపింగ్ చేయడం ప్రారంభించినప్పుడు చెమట పరిస్థితి తలెత్తుతుంది.

శరీర నొప్పులు

ఒక వ్యక్తి మెడ, దవడ, కడుపు, వెనుక భాగంలో నొప్పిని అనుభవిస్తే అది కొలెస్ట్రాల్‌ను పెంచే లక్షణం అయి ఉంటుంది.

పాదాలలో జలదరింపు

ఒక వ్యక్తికి చేతులు, కాళ్ళలో జలదరింపు అనిపించినా లేదా చీమ కుట్టినట్లు అనిపించినా అది కొలెస్ట్రాల్‌ను పెంచే లక్షణం కావొచ్చు. ఆక్సిజన్ ఉన్నా రక్తం అవయవాలకు చేరుకోనప్పుడు ఇలా జరుగుతుంది. అప్పుడు ఆ భాగాలలో జలదరింపు అనుభూతి పెరుగుతుంది.

కళ్లపై పసుపు దద్దుర్లు

ఒక వ్యక్తి కళ్లపై పసుపు మచ్చలు కనిపిస్తే అది కొలెస్ట్రాల్‌ను పెంచే లక్షణం కావొచ్చు. రక్తంలో కొవ్వు పరిమాణం పెరిగినప్పుడు ఇది జరుగుతుంది. పెరుగుతున్న కొలెస్ట్రాల్ లక్షణాలను ప్రజలు విస్మరిస్తారు. దీని కారణంగా వారు అనేక ఇతర సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. సకాలంలో చికిత్స తీసుకుంటే మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories