Rice Water: గంజిలో ఉన్న పోషకాలు తెలిస్తే నోరెళ్ల బెడుతారు.. !

Rice Water Benefits Wonder if you Know the Nutrients in Rice Water
x

Rice Water: గంజిలో ఉన్న పోషకాలు తెలిస్తే నోరెళ్ల బెడుతారు.. !

Highlights

Rice Water: వేసవి, వర్షాకాలంలో కలుషిత నీరు, డీహైడ్రేషన్ వల్ల వచ్చే వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి.

Rice Water: వేసవి, వర్షాకాలంలో కలుషిత నీరు, డీహైడ్రేషన్ వల్ల వచ్చే వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఇందులో ఒకటి అతిసారం. దీనివల్ల లూజ్ మోషన్, వాంతులు ఏర్పడుతాయి. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి శరీరంలో నీరు వేగంగా కోల్పోవడమే కాకుండా లవణాలు, ఖనిజాల కొరత ఏర్పడుతుంది. దీని వల్ల చాలా బలహీనత వస్తుంది. ఈ పోషకాహార లోపాలను త్వరగా తొలగించడంలో గంజి చాలా సహాయపడుతుంది. దీనిని ఎలా తయారుచేయాలో ఎలా ఉపయోగించాలోతెలుసుకుందాం.

వాస్తవానికి ఆయుర్వేదంలో చాలా వ్యాధులని ఆహారం ద్వారా నయం చేసే పద్ధతులు ఉన్నాయి. విరేచనం అయినప్పుడు గంజిని వాడితే తొందరగా ఉపశమనం ఉంటుంది. ప్రెషర్ కుక్కర్లు లేనప్పుడు అప్పట్లో గంజులో అన్నం వండేవారు. అన్నం ఉడికిన తర్వాత అందులో ఉండే మిగిలిన నీటిని వేరు చేసేవారు. దీనినే గంజి అంటారు. అన్నంలోని పోషకాలన్ని దాదాపు ఇందులోనే ఉంటాయి. కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు.

ఈ గంజిలో నల్ల ఉప్పు కలుపుకుని తాగితే శారీరక బలహీనత తొలగిపోతుంది. ఎందుకంటే ఇందులో ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇది విరేచనాలను కూడా నయం చేస్తుంది. గంజి తయారు చేయడానికి కుక్కర్‌లో కాకుండా ఏదైనా గిన్నెలో కొంచెం బియ్యం తీసుకోండి. అందులో కొద్దిగా నీరు పోసి తక్కువ మంట మీద ఉడికించండి. అన్నం ఉడికిన తర్వాత మిగిలిన నీటిని ఒక పాత్రలో వంపండి. ఈ నీరు మందంగా తెల్లగా ఉంటుంది. దీనినే గంజి అంటారు. ఇందులో బ్లాక్ సాల్ట్ కలిపి సూప్ లాగా తాగాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories