Cooking Oil: వాడిన నూనె మళ్లీ మళ్లీ వాడుతున్నారా..!

Repeated use of Used oil can Cause Fatal Diseases get Such oil out of the Kitchen Today
x

Cooking Oil: వాడిన నూనె మళ్లీ మళ్లీ వాడుతున్నారా..!

Highlights

Cooking Oil: పండుగల సీజన్ ప్రారంభమైంది. దీంతో చాలామంది ఇంట్లో తినుబండారాలని తయారుచేస్తారు.

Cooking Oil: పండుగల సీజన్ ప్రారంభమైంది. దీంతో చాలామంది ఇంట్లో తినుబండారాలని తయారుచేస్తారు. తర్వాత వీటికి ఉపయోగించిన నూనెని అలాగే ఉంచుతారు. అవసరం వచ్చినప్పుడు మళ్లీ ఉపయోగిస్తారు. దాదాపు ప్రతి ఇంట్లో జరిగేది ఇదే. కానీ ఉపయోగించిన నూనెని మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల అందులో ఎలాంటి రసాయనాలు ఉత్పన్నమవుతాయో తెలుసా..? నూనెను రెండు సార్లు వేడి చేస్తే చాలు. అంతకంటే ఎక్కువ సార్లు వేడిచేయకూడదు.. వాడకూడదు. కానీ రెస్టారెంట్లు, దాబాలలో నూనె పూర్తిగా అయిపోయేవరకు వాడుతారు. వాడిన నూనెతో వండిన ఆహార పదార్థాలని తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.

వాడిన నూనె DNAని మారుస్తుంది..

నూనెను చాలాసార్లు వేడి చేస్తే దాని లక్షణాలు మారుతాయి. అందులో ఉండే పోషకాలు విషపూరితం అవుతాయి. ఈ రకమైన నూనె వాడటం వల్ల శరీరంలో జెనోటాక్సిక్, మ్యూటాజెనిక్, కార్సినోజెనిక్ కార్యకలాపాలు పెరుగుతాయి. కణాలలో అవాంతరాలు మొదలవుతాయి. వాటి విచ్ఛిన్నం వేగం పెరిగి క్రోమోజోమ్‌లు దెబ్బతింటాయని పలు పరిశోధనలో తేలింది.

నూనెను ఎక్కువసేపు వేడిచేస్తే ఆ నూనె తీవ్రత మీ శరీరంపై కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ నూనె చాలా ప్రమాదకరంగా మారుతుంది. దీని వాసన ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతుంది. వంట నూనెల పొగలో 200 కంటే ఎక్కువ రకాల వాయువులు ఉంటాయి. ఇవి శరీరానికి హాని చేస్తాయి. అధిక మంటపై నూనెలో ఏదైనా వేయించినప్పుడు దాని నుంచి పొగ వస్తుంది. ఇది కొవ్వు ఆమ్లాలను కలిగి ఉన్న పొగ. దీని కారణంగా న్యుమోనియా, రినిటిస్ అలాగే ఊపిరితిత్తుల క్యాన్సర్, క్షయ, ఆస్తమా వంటి తీవ్రమైన వ్యాధులు సంభవిస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories