Hot Water: చలికాలం వేడినీళ్లు తాగేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి.. లేదంటే చాలా నష్టపోతారు..!

Remember these Things before Drinking Hot Water in Winter Otherwise You Will Lose a Lot
x

Hot Water: చలికాలం వేడినీళ్లు తాగేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి.. లేదంటే చాలా నష్టపోతారు..!

Highlights

Hot Water: చలికాలం వేడినీళ్లు తాగేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి.. లేదంటే చాలా నష్టపోతారు..!

Hot Water: చాలా మంది చలికాలంలో వేడి నీటిని తాగుతారు. దీనివల్ల గొంతు ఇన్ఫెక్షన్ నయమవుతుంది. వేడి నీరు పొట్టకు మేలు చేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థ క్లీన్‌గా ఉంచుతుంది. శరీరాన్ని లోపల నుంచి వెచ్చగా ఉంచుతుంది. ఆరోగ్య నిపుణులు చలికాలంలో వేడి నీటిని తాగాలని సిఫార్సు చేస్తున్నారు. కానీ వేడినీరు తాగడం వల్ల కొంతమందికి హానికరం. ఇది కొందరిలో వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం.

1.మన శరీరం సాధారణ నీటిని జీర్ణం చేసేలా శరీర వ్యవస్థ ఉంటుంది. ఇలాంటి సమయంలో వేడినీరు తాగినప్పుడు హాని కలుగుతుంది. కిడ్నీలు వేడి నీటిని ఫిల్టర్ చేయడం అంత సులభం కాదు. ముఖ్యంగా వేడి నీటిని ఎక్కువగా తాగినప్పుడు ఇది జరుగుతుంది. కిడ్నీ వేడి నీటిని ఫిల్టర్ చేయడానికి ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. దీని కారణంగా మూత్రపిండాలు సాధారణ రేటుతో పనిచేయలేవు.

2. కరోనా కాలంలో చాలా మంది తమను తాము ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చాలా వేడి నీటిని తాగారు. దీంతో కొందరి ఆరోగ్యంపై చెడు ప్రభావం పడింది. నీరు చాలా వేడిగా ఉంటే గొంతులో బొబ్బలు ఏర్పడతాయి. దీని కారణంగా శరీరం అంతర్గత కణజాలాలపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్ల ఎసిడిటీ సమస్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అధిక వేడి నీరు జీర్ణవ్యవస్థలో ఉండే పొరలకు హానికరం. దీని కారణంగా అల్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

3. కొందరికి రాత్రిపూట నిద్ర ఉండదు. ఒక వ్యక్తి రాత్రిపూట వేడినీరు తాగిన తర్వాత నిద్రపోతే అతను మళ్లీ మళ్లీ వేడినీరు తాగాల్సి ఉంటుంది. వేడినీళ్లకు బదులు గోరువెచ్చని నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేదంలో చెప్పారు. వేడినీళ్లు తాగే బదులు సాధారణ నీటిపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories