Hangover: హ్యాంగోవర్‌ బాధ ఉండొద్దంటే మద్యం తాగేముందు కచ్చితంగా ఈ విషయాలు గుర్తుంచుకోండి..!

Remember These Things Before Drinking Alcohol to Avoid Hangover
x

Hangover: హ్యాంగోవర్‌ బాధ ఉండొద్దంటే మద్యం తాగేముందు కచ్చితంగా ఈ విషయాలు గుర్తుంచుకోండి..!

Highlights

Hangover: హ్యాంగోవర్‌ బాధ ఉండొద్దంటే మద్యం తాగేముందు కచ్చితంగా ఈ విషయాలు గుర్తుంచుకోండి..!

Hangover: పార్టీలు, ఫంక్షన్‌లలో చాలామంది మద్యం ఎక్కువగా తాగుతారు. మరుసటి రోజు హ్యాంగోవర్‌కు గురవుతారు. దీనివల్ల తలనొప్పి, అలసట, వికారం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. హ్యాంగోవర్ చాలా సార్లు ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. అయితే కొన్ని పద్ధతులను పాటించడం వల్ల దీనిని నివారించవచ్చు. ఆల్కహాల్‌లో ఉండే ఇథనాల్‌ విచ్చిన్నం కావడం వల్ల హ్యాంగోవర్‌ సమస్య ఏర్పడుతుంది. చాలా మంది ప్రజలు పరగడుపుతో ఆల్కహాల్ తీసుకుంటారు. అంతేకాదు తాగేటప్పుడు తక్కువ నీటిని తీసుకుంటారు. దీని కారణంగా సమస్య పెరుగుతుంది.

వైద్యుల అభిప్రాయం ప్రకారం ఆల్కహాల్ తీసుకునే ముందు కొంచెం భోజనం చేసి ఉండాలి. కానీ భోజనం కారంగా ఉండకూడదు. పెరుగు లాంటి ఆహారం తీసుకుంటే మంచిది. తాగే తాగేటప్పుడు ఎక్కువగా నీళ్లు తాగాలి. మరుసటి రోజు డీహైడ్రేషన్‌కి గురైనప్పుడు వెంటనే నీరు తాగాలి. మద్యపానం చేసేటప్పుడు ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే మద్యం త్వరగా త్వరగా తాగకూడదు. కొంచెం సమయం ఇస్తూ తీసుకోవాలి.

హ్యాంగోవర్ నుంచి కోలుకోవడానికి గరిష్టంగా 24 గంటల సమయం పడుతుంది. అతిగా మద్యం తాగకూడదు. వారంలో 14 యూనిట్ల కంటే ఎక్కువ మద్యం తీసుకోకూడదు. ఇది కాలేయం, కిడ్నీపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. వైద్యుల ప్రకారం ఒక వ్యక్తి తన సామర్థ్యానికి మించి ఆల్కహాల్ తాగినప్పుడు కొన్ని గంటల తర్వాత దాని ప్రభావం కనిపిస్తుంది. ఇది 24 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో తలనొప్పి, కడుపు నొప్పి, ఛాతీలో మంట వంటి సమస్యలు ఉంటాయి. అందుకే ఎప్పుడూ ఖాళీ కడుపుతో మద్యం తాగకూడదు. ఇది అన్ని సమస్యలకు కారణమవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories