Bad Cholesterol: చెడు కొలస్ట్రాల్‌ని తగ్గించండి.. ఇవి తినడం ఆపకపోతే ఆయుష్షు తగ్గినట్లే..!

Reduce Bad Cholesterol Stop Eating These Ingredients From Today
x

Bad Cholesterol: చెడు కొలస్ట్రాల్‌ని తగ్గించండి.. ఇవి తినడం ఆపకపోతే ఆయుష్షు తగ్గినట్లే..!

Highlights

Bad Cholesterol: నేటి రోజుల్లో శారీరక శ్రమ తగ్గడంతో చాలామంది అధిక కొలస్ట్రాల్‌తో ఇబ్బంది పడుతున్నారు.

Bad Cholesterol: నేటి రోజుల్లో శారీరక శ్రమ తగ్గడంతో చాలామంది అధిక కొలస్ట్రాల్‌తో ఇబ్బంది పడుతున్నారు. కొవ్వులో 2 రకాలు ఉంటాయి. ఇందులో మంచి కొలస్ట్రాల్‌ పర్వాలేదు కానీ చెడు కొలస్ట్రాల్‌ వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఇది రక్తనాళాల్లో పేరుకుపోయి రక్త సరఫరాకి అడ్డంకిగా మారుతుంది. ఈ పరిస్థితిలో రక్తం గుండెకు చేరుకోవడం చాలా కష్టమవుతుంది. దీని కారణంగా హై బీపీ, డయాబెటీస్‌, ఊబకాయం, గుండెపోటు, హార్ట్‌ ఫెయిల్యూర్‌, కరోనరీ ఆర్టరీ డిసీజ్ వంటి వ్యాధులు సంభవిస్తున్నాయి. వీటిని నివారించాలంటే రోజువారీ డైట్‌లో కొన్ని ఆహార పదార్థాలని మినహాయించాలి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

తీపి పదార్థాలు

తీపి పదార్థాలు మనల్ని విపరీతంగా ఆకర్షిస్తాయి కానీ అవి ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఇందులో ఉండే చక్కెర చెడు కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది. రోజువారీ డైట్‌ నుంచి చక్కెర పదార్థాలు, క్యాండీలు, కుకీలు, కేకులు, ఫ్రూట్ షేక్స్, స్వీట్లను మినహాయించాలి.

ఆయిల్ ఫుడ్స్

భారతదేశంలో ఫ్రైడ్ ఫుడ్స్ తినే ట్రెండ్ ఎక్కువగా ఉంది. దీని కారణంగా చెడు కొలెస్ట్రాల్ రక్త నాళాలలో పేరుకుపోతుంది. కేలరీల పరిమాణం వేగంగా పెరుగుతుంది. వీటిని నివారించకపోతే చాలా వ్యాధులకి గురికావాల్సి ఉంటుంది.

ప్రాసెస్డ్ ఫుడ్

ఈ రోజుల్లో ప్రాసెస్‌ చేసిన ఆహారాలు తినే ట్రెండ్‌ విపరీతంగా పెరిగింది. ఇన్‌స్టంట్‌ ఫుడ్‌ అంటూ తెగ తినేస్తున్నారు. కొన్ని ఆహారాలు త్వరగా చెడిపోకుండా ప్రాసెస్ చేస్తారు. ఇటువంటి ఆహారంలో ట్రాన్స్ ఫ్యాట్, సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్, రక్తపోటును పెంచుతుంది. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పొంచి ఉంది.

రెడ్ మీట్

చాలామందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. దీనిని పరిమిత పరిమాణంలో తినవచ్చు కానీ ప్రతిరోజు తింటే శరీరంలో పెద్ద మొత్తంలో కొవ్వు పేరుకుపోతుంది. మాంసాన్ని తినాలనుకుంటే తక్కువ నూనెలో ఉడికించి, పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. లేదంటే ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories