ఎర్ర కారం ఎక్కువగా వాడుతున్నారా.. అయితే వీటి నుంచి తప్పించుకోలేరు..!

Red Chilli Powder Should not be Eaten in Excess Eating too Much will Cause These Diseases
x

ఎర్ర కారం ఎక్కువగా వాడుతున్నారా.. అయితే వీటి నుంచి తప్పించుకోలేరు..!

Highlights

Red Chilli Powder: భారతదేశాన్ని సుగంధ ద్రవ్యాల దేశం అని పిలుస్తారు.

Red Chilli Powder: భారతదేశాన్ని సుగంధ ద్రవ్యాల దేశం అని పిలుస్తారు. ఎందుకంటే ప్రాచీన కాలం నుంచి ఇక్కడ వాటిని ఎక్కువగా పండిస్తారు. అయితే వీటిలో కొన్నింటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. అటువంటి మసాలాలలో ఎర్ర మిరప పొడి ఒకటి. దీనిని ఎక్కువగా పొడి రూపంలోనే వాడుతారు. కొందరికి ఎర్ర కారం ఎక్కువగా తినడం అలవాటుగా ఉంటుంది. ఈ ఘాటైన అలవాటు శరీరానికి చాలా హాని చేస్తుంది. మిరప పొడి సైడ్‌ ఎఫెక్ట్స్‌ గురించి ఈ రోజు తెలుసుకుందాం.

విరేచనాలు

ఎర్ర మిరపకాయ చాలా ప్రజాదరణ పొందిన మసాలా. దీనిని వాడకుంటే వంటలు రుచిగా ఉండవు. అయితే ఎర్ర మిరపకాయను ఎక్కువగా తినడం వల్ల విరేచనాలు సంభవిస్తాయి. ఇది కడుపుకు అస్సలు మంచిది కాదు. పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. సాధారణంగా మనం మసాలా దినుసులను డీప్ ఫ్రై చేసినప్పుడు అది పొట్ట లోపలి భాగంలో అతుక్కుని సమస్యలను కలిగిస్తుంది.

ఎసిడిటీ

ఎర్ర మిరపకాయలు జీర్ణక్రియ సమస్యలను కలిగిస్తాయి. ఇది కడుపులో ఆమ్లత్వాన్ని కలిగిస్తుంది. అలాగే కొంతమంది ఛాతిలో మంట సమస్య తలెత్తుతుంది. మీకు అలాంటి సమస్య ఉంటే వెంటనే ఎర్ర మిరపకాయలను తీసుకోవడం మానేయండి.

కడుపులో పుండు

ఎర్రమిరపని ఎక్కువగా వాడితే కడుపులో అల్సర్ ఏర్పడుతుంది. దీని కణాలు పొట్టకు, పేగులకు అంటుకుని అల్సర్‌లకు కారణమవుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories