Vomiting with Fever: జ్వరంతో పాటు వాంతులు అవుతున్నాయా.. ఈ వ్యాధి చాలా ప్రాణాంతకం..!

Recognize the Symptoms of Dengue if there is Vomiting along with High Fever Immediately Rush to the Hospital
x

Vomiting with Fever: జ్వరంతో పాటు వాంతులు అవుతున్నాయా.. ఈ వ్యాధి చాలా ప్రాణాంతకం..!

Highlights

Vomiting with Fever: వరుసగా భారీ వర్షాలు కురవడంతో వరదల వల్ల పరిసర ప్రాంతాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి.

Vomiting with Fever: వరుసగా భారీ వర్షాలు కురవడంతో వరదల వల్ల పరిసర ప్రాంతాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఈగలు, దోమల బాధ ఎక్కువైంది. తినే ఆహారం తాగే మంచినీరు కలుషితమయ్యాయి. దీంతో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ఈ వ్యాధికి సంబంధించి కొన్ని లక్షణాలు ప్రాణాంతకంగా మారుతాయని వైద్యులు చెబుతున్నారు. అందుకే డెంగ్యూ వచ్చిన ప్రారంభంలోనే ఆసుపత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు. లేదంటే చిన్నపాటి నిర్లక్ష్యం మరణానికి కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు.

ఈ సీజన్‌లో రోజురోజుకూ డెంగ్యూ కేసులు పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. అందుకే డెంగ్యూ లక్షణాలను సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ సమయంలో ఎవరికైనా జ్వరం వస్తే డెంగ్యూ పరీక్ష చేయించుకోవాలి. అప్పుడే అది డెంగ్యూ జ్వరమా లేదా సాధారణ జ్వరమా తెలుస్తుంది. డెంగ్యూ ఉంటే వైద్యుల సలహా మేరకు చికిత్స ప్రారంభించాలి. డెంగ్యూ వ్యాధిలో మొదట తేలికపాటి జ్వరం వస్తుంది.

తర్వాత వాంతులు, విరేచనాలతో పాటు రోజురోజుకు జ్వరం ఎక్కువవుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే డెంగ్యూ ప్రమాదకరమైన స్థితిగా చెప్పవచ్చు. ఇలాంటి సమయంలో రోగికి డెంగ్యూ షాక్ సిండ్రోమ్ ఏర్పడుతుంది. దీని కారణంగా శరీరంలోని ప్లేట్‌లెట్ల సంఖ్య అకస్మాత్తుగా పడిపోతుంది. రోగి మూర్ఛపోవడం ప్రారంభిస్తాడు. కొన్ని సందర్భాల్లో అవయవ వైఫల్యం జరుగుతుంది. ఇది ప్రాణాంతకంగా మారుతుంది. ఈ పరిస్థితిలో వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణాపాయం తప్పదు.

డెంగ్యూ పరీక్ష

రోగికి జ్వరం వచ్చిన సందర్భాలు చాలా ఉంటాయి. డెంగ్యూ పరీక్షలు చేయించుకోకుంటే సకాలంలో వైద్యం అందక రోగి మరణిస్తాడు. దీన్ని నివారించడానికి జ్వరం వచ్చినప్పుడు డెంగ్యూ పరీక్ష చేయించుకోవడం అవసరం. ఒకవేళ ఇది డెంగ్యూ జ్వరం అని తేలితే వైద్యుడిని సంప్రదించాలి. వారు మందుల ద్వారా వ్యాధిని నియంత్రించగలరు. దీనివల్ల తీవ్రమైన లక్షణాల నుంచి బయటపడుతారు.

ఈ లక్షణాలు గమనించండి

1. 100 డిగ్రీల కంటే ఎక్కువ జ్వరం

2. వాంతులు, విరేచనాలు (వాంతిలో రక్తం)

3. తీవ్రమైన తలనొప్పి

4. కండరాల నొప్పి

ఇవి పాటించండి

1. ఇంటి చుట్టూ నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి

2. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలి

3. చేతులు, కాళ్ల నిండా దుస్తులు ధరించాలి

4. నిద్రపోయేటప్పుడు దోమతెర ఉపయోగించాలి

Show Full Article
Print Article
Next Story
More Stories