Raw Milk: పచ్చిపాలతో అందానికి మెరుగులు.. ఇలా ట్రై చేయండి..

Raw Milk is The Solution to All Skin Problems Try This | Skin Care Tips
x

Raw Milk: పచ్చిపాలతో అందానికి మెరుగులు.. ఇలా ట్రై చేయండి..

Highlights

Raw Milk: పచ్చిపాలలో చర్మానికి అవసరమయ్యే అన్ని పోషకాలు ఉంటాయి. ఇవి అందాన్ని పెంచుతాయి...

Raw Milk: పచ్చిపాలలో చర్మానికి అవసరమయ్యే అన్ని పోషకాలు ఉంటాయి. ఇవి అందాన్ని పెంచుతాయి. చలికాలంలో నిర్జీవంగా ఉన్న ముఖాన్ని కాంతివంతంగా చేస్తాయి. పచ్చి పాలు చర్మాన్ని లోపలి నుంచి హైడ్రేట్ చేస్తాయి. పొడి చర్మాన్ని మృదువుగా మెరిసేలా చేస్తాయి. మీ ముఖంపై ముడతలు ఉన్నా, కళ్లకింద నల్లటి వలయాలు ఉన్నా పచ్చిపాలతో మర్దన చేస్తే చక్కటి ఫలితాలు ఉంటాయి. అయితేఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేయడంలో ఉపయోగపడుతుంది. మీరు డల్స్కిన్‌పై మెరుపును తీసుకురావాలనుకుంటే రాత్రి పడుకునే ముందు పచ్చి పాలను మీ ముఖానికి కాటన్ ద్వారా బాగా రుద్దాలి. ఇలా ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే ముఖం కడిగేస్తే అద్భుతంగా ఉంటుంది.

అలాగే అర టీస్పూన్ గ్లిజరిన్‌లో 4 టేబుల్ స్పూన్ల పాలను మిక్స్ చేసి కాటన్ సహాయంతో మెడ నుంచి ముఖంపై అప్లై చేయండి. కనీసం 15 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత సాధారణ నీటితో కడగాలి. ఇది మీ చర్మాన్ని మృదువుగా చేస్తుంది.

ముఖంపై ఉన్న డెడ్‌ స్కిన్‌ తొలగించాలంటే పచ్చి పాల సహాయంతో స్క్రబ్బర్‌ను సిద్ధం చేసుకోండి. దీని కోసం 3 టేబుల్ స్పూన్ల పచ్చి పాలలో ఒక చెంచా శెనగపిండి, ఒక చెంచా చక్కెర కలపండి. రెండు మూడు నిమిషాల పాటు మెడ నుంచి ముఖం వరకు స్క్రబ్ చేయండి. ఆ తర్వాత సుమారు 20 నిమిషాల పాటు ఆరనివ్వండి. తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే చాలా తేడా గమనిస్తారు. అంతేకాదు పచ్చి పాలలో తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే గొప్ప బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories