Railway Super App: రైల్వే సూపర్‌ యాప్‌ వచ్చేస్తుంది.. టికెట్‌ బుకింగ్‌ నుంచి రైలు ట్రాకింగ్‌ వరకు అంతా ఈజీ..!

Railway Super App is Coming everything from Ticket booking to train tracking is easy
x

Railway Super App: రైల్వే సూపర్‌ యాప్‌ వచ్చేస్తుంది.. టికెట్‌ బుకింగ్‌ నుంచి రైలు ట్రాకింగ్‌ వరకు అంతా ఈజీ..!

Highlights

Railway Super App: ఇండియన్‌ రైల్వేస్‌ త్వరలో సరికొత్త సూపర్‌ యాప్‌ను తీసుకురాబోతుంది. దీనివల్ల ప్రయాణికులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు చెక్‌ పడనుంది.

Railway Super App: ఇండియన్‌ రైల్వేస్‌ త్వరలో సరికొత్త సూపర్‌ యాప్‌ను తీసుకురాబోతుంది. దీనివల్ల ప్రయాణికులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు చెక్‌ పడనుంది. సామాన్య ప్రజల సౌకర్యార్థం భారతీయ రైల్వే ఈ యాప్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని ప్రత్యేకత ఏంటంటే ప్రయాణికులు వివిధ సేవల కోసం వివిధ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకునే బదులు ఈ ఒక్క సూపర్ యాప్ ఇన్‌స్టాల్‌ చేసుకుంటే చాలు. ఇందులో టిక్కెట్ బుకింగ్, PNR స్టేటస్ చెకింగ్, రైలు ట్రాకింగ్ మొదలైన సదుపాయాలు లభిస్తాయి.

మీడియా నివేదికల ప్రకారం మీరు UTS (అన్ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్), రైల్ మదద్, NTES (నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్) అందించే విభిన్న సేవలను ఈ సూపర్ యాప్‌లో మాత్రమే పొందుతారు. ఇది వచ్చిన తర్వాత వివిధ సేవల కోసం వివిధ యాప్‌ల మధ్య మల్టీ టాస్కింగ్ అవసరం ఉండదు. నివేదికల ప్రకారం ఈ యాప్‌ను డెవలప్‌ చేయడానికి రూ. 90 కోట్లు ఖర్చు అవుతుందని తెలిసింది. ఈ యాప్‌ను ప్రారంభించడానికి మరికొంత సమయం పడుతుంది.

ఈ సూపర్ యాప్‌ని ఎవరు సిద్ధం చేస్తున్నారు?

భారతీయ రైల్వే ఈ సూపర్ యాప్‌ను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే CRIS అభివృద్ధి చేస్తోంది. నివేదికల ప్రకారం రైల్వే సూపర్ యాప్ ద్వారా మీరు టిక్కెట్ బుకింగ్, PNR స్టేటస్ చెక్, రైలు ట్రాకింగ్ ప్రయోజనం మాత్రమే కాకుండా మీరు ఫ్లైట్ టిక్కెట్ బుకింగ్, రైలులో ఫుడ్ డెలివరీ వంటి సౌకర్యాల ప్రయోజనాలను పొందుతారు. ప్రభుత్వం UMANG యాప్ ప్రజలకు అనేక సేవలను అందిస్తున్నట్లుగా రైల్వే సూపర్ యాప్ ప్రజలకు అనేక సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రారంభిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories