Ragi Java: శరీర ఆరోగ్యానికి రాగిజావ

Ragi Java Good for Health
x

Ragi జావా:(ఇమేజ్ ఫైల్)

Highlights

Ragi Java: రాగుల్లో వున్నంత ప్రొటీన్ మిగత ఆహార పదార్థాల్లో అంతగా లభించదు.

Ragi Java: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. మరో వైపు ఎండలు ముదురుతున్నాయి. వాతావరణ మార్పుతో పిల్లలు, పెద్దలు, వృద్ధుల్లో ఆరోగ్యపరమైన ఇబ్బందులు మొదలవుతాయి. ఒంట్లో వేడిమి పెరుగుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే పిల్లలకు మామూలు డైట్‌తో పాటు ఒంట్లో వేడిని తగ్గించే పానీయాలను అందించాలి. అలాంటి పానియాల్లో రాగి జావ ఒకటి. కొంత రాగి జావ అంటే ముఖం తిప్పేసుకుంటారు. దానిలో వున్న పోషకాలు తెలుసుకుంటే అస్సలు వదలరు. పైగా ఇండియన్ క్లైమేట్ లో ఇది బాగా పండుతుంది. ఒక్కసారి రాగులు మనకి చేసే మేలు ఏంటో "లైఫ్ స్టైల్" లో చూద్దాం.

రాగుల్లో పోషకాలు మెండు...

రాగుల్లో ఉన్న పోషకాలు మెండు. తక్కువ ధరలో, అందరికీ సులభంగా లభించే ఈ రాగులతో ఎన్నో అద్భుతగుణాలు దాగి ఉన్నాయి. వరి లో ఉన్నంత ప్రొటీన్ రాగుల్లో కూడా ఉంటుంది. అయితే, ఈ ప్రొటీన్ మిగత ఆహార పదార్థాల్లో అంతగా లభించదు. ఇది శారీరక ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉన్నన్ని పోషకాలు మిగిలిన ఏ ధాన్యాలలోనూ లేవు. కాబట్టి, రోజువారీ ఆహారంలో దీన్ని భాగం చేసుకున్నవారికి పోషకాహారలేమి అంటూ ఉండదు.

కాల్షియం 5-30 శాతం..

రాగుల్లో మినరల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన ధాన్యాల్లో కంటే ఇందులో కాల్షియం 5-30 శాతం ఎక్కువగా ఉంది. ఇందులో ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్ కూడా ఎక్కువగా ఉన్నాయి. కాల్షియం సప్లిమెంటు తీసుకునే బదులు రాగులు తినడం మంచిది. హీమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉన్నవారూ, ఆస్టియోపొరాసిస్ వచ్చే అవకాశం ఉన్నవారూ రాగుల్ని తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. అందుకే వయసు పెరిగిన వారు.. చిన్నపిల్లలు వీటిని రెగ్యులర్‌గా తీసుకోవాలి.

మధుమేహానికి చెక్...

మధుమేహ వ్యాప్తి వలన కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, పీచు పదార్ధాలూ, ఫైటో కెమికల్స్ ఎక్కువగా ఉన్న ఆహారంతీసుకోవాలి. ఫైటోకెమికల్స్ వ్యాధుల్ని ఎదుర్కోవడంలో మనకి సాయం చేస్తాయి. అయితే, ఇవి ధాన్యపు పై పొరలో ఉంటాయి. కాబట్టి హోల్ గ్రైన్స్ తినడం మంచిది. రాగుల పై పొరలో మిగిలిన ధాన్యాలకంటే ఎక్కువ పాలిఫినాల్స్ ఉంటాయి. రాగులు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించడమే కాకుండా హైపోగ్లెసీమిక్ స్ట్రెస్ ని తగ్గిస్తాయి.

గుండె జబ్బుల నివారణలో...

యాంటీ-బాక్టీరియల్ గుణాలు రాగుల్లో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, ఫుడ్ పాయిజనింగ్ కీ, టైఫాయిడ్ లాంటి జ్వరాలకీ, సెల్యులైటిస్ లాంటి స్కిన్ ఇన్ ఫెక్షన్స్ ఉన్నప్పుడు వీటిని జావలా చేసుకుని తాగడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. చాలా మంది జ్వరంగా ఉన్న సమయంలో మందులు వాడుతుంటారు. అలా కాకుండా దీనిని రెగ్యులర్‌గా తీసుకుంటే ఆ సమస్య తగ్గిపోతుంది. రాగులు ట్రైగ్లిసరైడ్స్ ఏర్పడకుండా చేసి గుండెజబ్బులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి. రాగి మాల్ట్, రాగి లడ్డూ, రాగి హల్వా, రాగి పకోడా, రాగి బిస్కెట్లూ, రాగి దోసె, రాగి సంకటి లాంటివి ట్రై చేసి చూడండి.

క్యాన్సర్ నుండి కాపాడుటలో కీలక పాత్ర...

రాగుల్లో యాంటీ-ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ యాంటీ-ఆక్సిడెంట్స్ సెల్ డామేజ్ జరగకుండా చేసి కాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా చేస్తాయి. కాబట్టి, ముందు నుంచే వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి కాన్సర్ కారక సమస్యలు మనదరికి చేరకుండా ఉంటాయి. అంతే కాదండోయ్ ప్రపంచాన్ని వణికిస్తోన్నకరోనా నుండి కాపాడుగలం ఈ రాగి జావ తాగటం వల్ల... సో ఇంకెందు కుటుంబం అంతా రోజు వారి ఆహారంలో రాగి జావను చేర్చుకుంటే పోలా...

Show Full Article
Print Article
Next Story
More Stories