Thyroid: గర్భిణులు థైరాయిడ్‌ విషయంలో జాగ్రత్త.. లేదంటే ఈ సమస్యలు వచ్చే అవకాశం..?

Pregnant Women Should be Careful About Their Thyroid or These Problems
x

Thyroid: గర్భిణులు థైరాయిడ్‌ విషయంలో జాగ్రత్త.. లేదంటే ఈ సమస్యలు వచ్చే అవకాశం..?

Highlights

Thyroid: అమ్మ అవడం ప్రతి మహిళ కల. అందుకోసం తొమ్మిది నెలలు చాలా కష్టపడుతారు. బిడ్డకోసం పడరాని పాట్లు పడుతారు.

Thyroid: అమ్మ అవడం ప్రతి మహిళ కల. అందుకోసం తొమ్మిది నెలలు చాలా కష్టపడుతారు. బిడ్డకోసం పడరాని పాట్లు పడుతారు. గర్భీణిగా ఉన్న సమయంలో శరీరంలో హార్మోన్ల మార్పులు జరగుతుంటాయి. దీంతో మహిళలు చాలా ఆరోగ్య సమస్యలని ఎదుర్కొంటారు. ముఖ్యంగా థైరాయిడ్‌ గ్రంథి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది హార్మోన్ల స్థాయిని నియంత్రిస్తుంది. సాధారణంగా థైరాయిడ్‌లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి హైపర్ థైరాయిడిజం, రెండోది హైపోథైరాయిడ్. చాలా సార్లు మహిళలు తమ లక్షణాలను సాధారణమైనవిగా భావిస్తారు కానీ వారికి చికిత్స చేయడం చాలా అవసరం.

థైరాయిడ్ గ్రంధి వేగంగా ఉన్నప్పుడు హైపర్ థైరాయిడిజం అంటారు. ఈ పరిస్థితిలో అధిక వేడి, క్రమరహిత హృదయ స్పందన, అలసట, విశ్రాంతి లేకపోవడం, వికారం, వాంతులు, చేతులు వణుకు, నిద్రలో ఇబ్బంది, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. థైరాయిడ్ గ్రంధి పనికిరాని స్థితిలో ఉన్నప్పుడు హైపోథైరాయిడ్ అంటారు. ఈ పరిస్థితిలో అధిక అలసట, బరువు పెరగడం, మలబద్ధకం, ఏకాగ్రతలో ఇబ్బంది, జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు, అధిక చలి, కండరాల తిమ్మిరి మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.

హైపోథైరాయిడ్ సమస్య ఏర్పడినప్పుడు శిశువు అభివృద్ధిలో ఆలస్యం కావచ్చు. గర్భధారణ సమయంలో హైపోథైరాయిడ్ తీవ్రమైన రూపం తీసుకుంటే లేదా సకాలంలో చికిత్స తీసుకోకపోతే, పిల్లల మానసిక అభివృద్ధి చాలా నెమ్మదిగా ఉంటుంది. ఇది వారి IQ స్థాయిని కూడా ప్రభావితం చేస్తుందని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి. దీని కారణంగా ప్రసవం తర్వాత కూడా శిశువు అభివృద్ధిలో ఆలస్యం కావచ్చు. గర్భధారణ సమయంలో హైపోథైరాయిడ్‌ను లెవోథైరాక్సిన్ అనే సింథటిక్ హార్మోన్‌తో చికిత్స చేస్తారు. ఎప్పటికప్పుడు థైరాయిడ్ పరీక్షలు చేస్తారు. అధిక థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రించడానికి యాంటీ థైరాయిడ్ మందులు ఇస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories