Potatoes Benefits: బంగాళదుంపతో భలే ప్రయోజనాలు.. సులువుగా బరువు తగ్గొచ్చు..!

Potatoes Help In Weight Loss Get These Great Benefits
x

Potatoes Benefits: బంగాళదుంపతో భలే ప్రయోజనాలు.. సులువుగా బరువు తగ్గొచ్చు..!

Highlights

Potatoes Benefits: బంగాళదుంపలు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా తినే కూరగాయగా చెప్పవచ్చు.

Potatoes Benefits: బంగాళదుంపలు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా తినే కూరగాయగా చెప్పవచ్చు. ఇది దేశంలో ఎక్కడైనా లభిస్తుంది. అయితే చాలామంది బంగాళాదుంపను కార్బోహైడ్రేట్‌గా పరిగణిస్తారు. కానీ నిజానికి బంగాళాదుంప వినియోగం మధుమేహం, బరువు తగ్గడం, అనేక ఇతర వ్యాధుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. దీని ప్రయోజనాల గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మధుమేహ రోగులు

డయాబెటిక్ రోగులకు బంగాళాదుంప మంచిదిగా చెప్పవచ్చు. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి చక్కెర శాతాలని అదుపులో ఉంచుతాయని కొన్ని పరిశోధనలలో తేలింది. ఇది కాకుండా ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆహారం. ఇది డయాబెటిక్ రోగికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

బరువు తగ్గడం

బరువు తగ్గాలనే వ్యక్తులకి బంగాళదుంప మంచి ఎంపిక. ఇవి ఆకలిని తగ్గిస్తాయి. ఎక్కువగా తినాలనే కోరిక ఉండదు. అంతేకాదు ఇందులో ఫైబర్, సేంద్రీయ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడంలో సహాయపడుతాయి.

వ్యాధుల తగ్గింపు

బంగాళదుంపలు తినడం వల్ల ఆరోగ్యానికి సంబంధించి అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం వంటి అంశాలను కలిగి ఉంటుంది. గుండె జబ్బులు, అధిక రక్తపోటు, ఒత్తిడి నుంచి రక్షించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా బంగాళదుంపలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రీబయోటిక్‌లను కలిగి ఉంటాయి.

ఏ మార్గాల్లో తినవచ్చు

బంగాళదుంపలని ఉడకబెట్టి తింటే ఆరోగ్యానికి మంచిది. అంతేకాదు కూరగా కూడా వండుకోవచ్చు. చిప్స్‌గా స్నాక్‌రూపంలో తినవచ్చు. కానీ ఎక్కువగా తినకూడదని గుర్తుంచుకోండి. అంతేకాదే వీటిని చాలాకాలం పాటు నిల్వ ఉంచుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు.

Show Full Article
Print Article
Next Story
More Stories