Piles Treatment: ఇంట్లో ఉండే ఈ చెట్టు పైల్స్‌ వ్యాధికి దివ్యవౌషధం.. 15 రోజుల్లో పూర్తిగా నయం..!

Piles Disease Can Be Prevented With Aloe Vera Try This Way
x

Piles Treatment: ఇంట్లో ఉండే ఈ చెట్టు పైల్స్‌ వ్యాధికి దివ్యవౌషధం.. 15 రోజుల్లో పూర్తిగా నయం..!

Highlights

Piles Treatment: ఈ రోజుల్లో చాలామంది పైల్స్‌ వ్యాధితో బాధపడుతున్నారు. కారణం శారీరక శ్రమ లేకుండా ఒకే దగ్గర గంటల తరబడి కూర్చొని పనిచేయడం.

Piles Treatment: ఈ రోజుల్లో చాలామంది పైల్స్‌ వ్యాధితో బాధపడుతున్నారు. కారణం శారీరక శ్రమ లేకుండా ఒకే దగ్గర గంటల తరబడి కూర్చొని పనిచేయడం. అలాగే సమయానికి తినకపోవడం సమయానికి పడుకోపోవడం వల్ల కూడా ఈ వ్యాధి సంభవిస్తుంది. పైల్స్‌ నిత్యం బాధించే ఒక వ్యాధి. ప్రారంభంలో పురీషనాళం వెలుపల దురద ప్రారంభమవుతుంది. తరచుగా గోకడం వల్ల అక్కడ గాయం ఏర్పడుతుంది. దీంతోపాటు పురీషనాళం సిరలు వాచిపోతాయి. పాయువు వద్ద ఒక గడ్డ ఏర్పడుతుంది. దీనివల్ల మలవిసర్జన చేసేటప్పుడు నొప్పిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఇంట్లో లభించే కలబందతో పైల్స్‌ని నివారించవచ్చు. అది ఎలాగో ఈ రోజు తెలుసుకుందాం.

అలోవెరాలో ఖనిజాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లతో సహా చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. కలబందలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల పైల్స్ నొప్పి, వాపు తగ్గుతుంది. ఆయుర్వేద నిపుణుల సలహా మేరకు కలబందను వాడితే చాలా త్వరగా ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చు. దీనిని ఏ విధంగా తయారుచేయాలో చూద్దాం.

కలబందను ఎలా ఉపయోగించాలి?

పైల్స్ సమస్య నుంచి బయటపడేందుకు ఒక చెంచా అలోవెరా జెల్‌ను తీసుకుని, దానికి చిటికెడు పసుపు పొడిని కలిపి ఒక పేస్టులా తయారుచేసుకోవాలి. దీనిని మలద్వారంపై రోజుకు 3 నుంచి 4 సార్లు అప్లై చేసుకోవాలి. వారంలో ఉపశమనం పొందుతారు. మలబద్ధకం వల్ల పైల్స్ వ్యాధి ఏర్పడుతుంది. దీనిని అధిగమించడానికి ప్రతిరోజూ పరగడుపున కలబంద రసాన్ని తాగాలి. తాజా కలబంద ఆకులను కట్ చేసి అందులోని గుజ్జును మిక్సీలో మెత్తగా చేసి జ్యూస్ చేయాలి. తర్వాత ఆ జ్యూస్‌ని ప్రతిరోజూ తీసుకోవాలి. 15 రోజుల్లో చాలా తేడాను గమనిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories