Mushrooms: ఈ ఆరోగ్య సమస్యలున్నవారు పుట్టగొడుగులు తినవద్దు.. నష్టాన్ని భరించలేరు..!

People With These Health Problems Should Not Eat Mushrooms Cant Avoid Damage
x

Mushrooms: ఈ ఆరోగ్య సమస్యలున్నవారు పుట్టగొడుగులు తినవద్దు.. నష్టాన్ని భరించలేరు..!

Highlights

Mushrooms: పుట్టగొడుగులు చాలా ఖరీదైన ఆహారం. ఇందులో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

Mushrooms: పుట్టగొడుగులు చాలా ఖరీదైన ఆహారం. ఇందులో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. శరీరానికి అవసరమయ్యే B, D విటమిన్లు, పొటాషియం, కాపర్, ఐరన్, సెలీనియం సమృద్ధిగా ఉంటాయి. అయితే పుట్టగొడుగులలో రకరకాలుగా ఉంటాయి. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తినకూడదు. వీటివల్ల వారికి చాలా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి. అందుకే మంచి పుట్టగొడుగులు, చెడు పుట్టగొడుగుల మధ్య తేడాను గుర్తించాలి. అయితే ఎవరు వీటికి దూరంగా ఉండాలో ఈరోజు తెలుసుకుందాం.

అజీర్ణం

తరచుగా కడుపు నొప్పితో బాధపడేవారు పుట్టగొడుగులను తినడం మానుకోవాలి. ఎందుకంటే ఇది కడుపులో మరింత అసౌకర్యాన్ని పెంచుతుంది. కడుపు నొప్పి, వాంతులు, వికారం, విరేచనాలు వంటి సమస్యలను కలిగిస్తుంది.

చర్మ సమస్యలు

పుట్టగొడుగులను తినడం వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉంటాయి. అయితే చర్మ సమస్యలు ఉన్నవారు ఈ సూపర్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. చర్మంపై దద్దుర్లు, చికాకు, అలెర్జీలు ఉంటే పుట్టుగొడుగులు తినవద్దు.

అలసట

తరచు అలసటతో బాధపడేవారు పుట్టగొడుగులను తినడం మంచిది కాదు. శరీరంలో శక్తిలేకపోవడం వల్ల కొంతమంది ఊరికే అలసిపోతుంటారు. అయితే పుట్టగొడుగులను తిన్న తర్వాత వారు బాగా అలసటకు గురవుతారు. అందుకే ఒంట్లో శక్తి తక్కువగా ఉన్నవారు పుట్టగొడుగులను తినకూడదు.

గర్భిణులు

పై సమస్యలున్న వారే కాదు.. గర్భిణులు కూడా పుట్టగొడుగులను తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాలిచ్చే తల్లుల్లు, గర్భిణులు ఈ సూపర్ ఫుడ్ కూడా దూరంగా ఉండాలి. ఇవి వీరిపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories