Shape Of Eyes: ఇలాంటి కళ్లు ఉన్న వ్యక్తులు జీవితంలో ఓడిపోరు.. అదృష్టం వారివెంటే..!

People with Such Eyes do not Lose in life Luck is with them
x

Shape Of Eyes: ఇలాంటి కళ్లు ఉన్న వ్యక్తులు జీవితంలో ఓడిపోరు.. అదృష్టం వారివెంటే..!

Highlights

Shape Of Eyes: ఇలాంటి కళ్లు ఉన్న వ్యక్తులు జీవితంలో ఓడిపోరు.. అదృష్టం వారివెంటే..!

Shape Of Eyes: లోకంలో మనుషులని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని చెబుతారు. ఇది నిజమో కాదో తెలియదు కానీ ప్రతి మనిషి శరీరాకృతి మాత్రం భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా కళ్ల విషయంలో చాలా తేడాలుంటాయి. ఒక వ్యక్తి కళ్ల ఆకృతి గమనించి అతని వ్యక్తిత్వం గురించి చెప్పవచ్చు. ఒక వ్యక్తి స్వభావం గురించి కళ్ళు ఏ విధంగా చెబుతాయో సాముద్రిక శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు. వివిధ రకాలైన కళ్లు ఉన్న వ్యక్తుల స్వభావం గురించి ఈ రోజు తెలుసుకుందాం.

పైకి తిరిగిన కళ్ళు

కళ్ల చివర్లు ఎత్తుగా ఉంటే కళ్లు పైకి లేచినట్లు అర్థం. సాముద్రిక శాస్త్రం ప్రకారం పైకి తిరిగిన కళ్లు ఉన్న వ్యక్తులు మంచి మనస్సు కలిగి ఉంటారు. సంతోషంగా ఉండేందుకు ఇష్టపడతారు. చాలా ఓపెన్ మైండెడ్ కలవారు. ఇతరులని ఇట్టే ఆకట్టుకుంటారు. ఏ పని చేసినా ఉత్సాహంగా చేస్తారు.

కిందికి తిరిగిన కళ్ళు

కళ్ల చివర్లు కిందికి వాలుగా ఉంటే కిందికి తిరిగిన కళ్లు అని అర్థం. సాముద్రిక శాస్త్రం ప్రకారం కిందికి తిరగిన కళ్లు ఉన్నవారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. చాలా తక్కువ మందితో మాత్రమే స్నేహం చేస్తారు. నిజానికి వీరికి ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడటం ఇష్టం ఉండదు. వారి వ్యక్తిత్వం ఇతరులకి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వీరు ఏ నిర్ణయమైనా ప్రశాంతంగా తీసుకుంటారు. అందుకే జీవితంలో ఎన్నో విజయాలు సాధిస్తారు.

గుండ్రని కళ్ళు

లోపలి నలుపు ఐబాల్ దిగువ కనురెప్పకు దూరంగా ఉంటే గుండ్రని కళ్ళు ఉన్నాయని అర్థం. సాముద్రిక శాస్త్రం ప్రకారం గుండ్రని కళ్లు ఉన్న వ్యక్తులు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. తమ సౌలభ్యంతో ప్రజలను తమవైపు ఆకర్షిస్తారు. వారి కళ్లలోని మెరుపు నిత్యం వారిని పాజిటివ్‌లా ఉండేలా చేస్తుంది.

బాదం కళ్ళు

లోపలి నల్లటి కనుబొమ్మలు ఎగువ అలాగే దిగువ కనురెప్పలకు జోడించబడి ఉంటే బాదం కళ్లు అని అర్థం. సాముద్రిక శాస్త్రం ప్రకారం ఇలాంటి వ్యక్తులు నిత్యం పాజిటివ్‌గా ఉంటారు. ఆత్మ విశ్వాసం కలిగి ఉంటారు. సమయానికి అనుగుణంగా ఎలా మారాలో వీరికి తెలిసినంతగా మరెవ్వరికి తెలియదు. ఇలాంటి వ్యక్తులు తమ తెలివితేటలతో ఎలాంటి సమస్య నుంచైనా బయటపడుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories