Heart Attack: ఈ పొరపాటు వల్ల గుండెపోటు వస్తుంది జాగ్రత్త.. !

People who Dont get Enough Sleep Have a Higher Risk of Heart Attack
x

Heart Attack: ఈ పొరపాటు వల్ల గుండెపోటు వస్తుంది జాగ్రత్త.. !

Highlights

Heart Attack: ప్రపంచంలో గుండెపోటు తీవ్రమైన వ్యాధిగా మారింది.

Heart Attack: ప్రపంచంలో గుండెపోటు తీవ్రమైన వ్యాధిగా మారింది. ఒక్క భారతదేశంలోనే హృద్రోగుల సంఖ్య కోట్లలో ఉంది. అయితే ప్రస్తుత రోజుల్లో యువత కూడా ఈ వ్యాధి బారిన పడుతుండటం ఆందోళన కలిగించే విషయం. అంతేకాదు అకాలంగా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. చాలా సందర్భాలలో గుండె జబ్బులు జన్యుపరమైనవి కావు జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల సంభవిస్తున్నాయి. గుండెపోటు రాకుండా ఉండాలంటే మనం ఏ తప్పులు చేయకూడదో తెలుసుకోవాలి.

1. స్లీప్ డిజార్డర్

మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా మంది ఆరోగ్య నిపుణులు రోజులో కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని చెబుతున్నారు. తగినంత నిద్ర లేని వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

2. వాయుకాలుష్యం

పెద్ద నగరాల కంటే గ్రామాల ప్రజలకు గుండెపోటు రిస్క్‌ తక్కువగా ఉంటుంది. వారు స్వచ్ఛమైన గాలిని పీల్చడం వల్ల పొగ, డస్ట్‌కి దూరంగా ఉంటున్నారు. ఇవి రెండు గుండెకు చాలా హాని కలిగిస్తున్నాయని అనేక పరిశోధనలలో వెల్లడైంది. కాబట్టి గుండెపోటుని నివారంచాలంటే స్వచ్ఛమైన గాలి ఉండే దగ్గర ఉంటే మంచిది.

3. ధూమపానం, మద్యపానం

సిగరెట్, ఆల్కహాల్ మన శరీరానికి అంతర్గత నష్టాన్ని కలిగిస్తున్నాయని అందరికి తెలుసు. ఈ చెడు అలవాట్ల కారణంగా రక్తపోటు పెరుగుతుంది. ఇది తరువాత గుండెపోటుకు కారణం అవుతుంది. అందుకే వెంటనే మానేస్తే మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories