Health News: అధిక బీపీతో బాధపడుతున్నవారు ఈ ఆహారాలు తింటే బెటర్..!

People suffering from high BP are better off eating these foods | High BP Control Foods
x

Health News: అధిక బీపీతో బాధపడుతున్నవారు ఈ ఆహారాలు తింటే బెటర్..!

Highlights

Health News: మారుతున్న జీవనశైలి కారణంగా ప్రస్తుతం చాలామంది అధిక బీపీతో బాధపడుతున్నారు...

Health News: మారుతున్న జీవనశైలి కారణంగా ప్రస్తుతం చాలామంది అధిక బీపీతో బాధపడుతున్నారు. ముఖ్యంగా యువతలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. 'అధిక రక్తపోటు' శరీరంలో గుండె సమస్యలను పెంచుతుంది. అయితే మీరు మీ జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యని నియంత్రించవచ్చు. మీరు అధిక రక్తపోటుతో బాధపడతున్నట్లయితే ఎక్కువ ఉప్పు, తీపి, కొవ్వు పదార్ధాలను తినకూడదు. ఇలాంటివి తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. మీరు ఆహారంలో కొన్ని పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు చేర్చినట్లయితే రక్తపోటును నియంత్రించవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

వీటిని తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది

గుమ్మడి గింజల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఫ్యాటీ ఫిష్ తినడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మన హృదయాన్ని ఫిట్‌గా ఉంచుతాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతాయి.

నేరేడు పండు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే ఆంథోసైనిన్ యాంటీఆక్సిడెంట్లు రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిని పెంచుతాయి. నేరేడు పండ్లు తింటే రక్తపోటు తగ్గుతుంది. పిస్తా ఒక డ్రై ఫ్రూట్. దీనిని ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి. వీటిని తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. పిస్తాలో పొటాషియం, వివిధ రకాల పోషకాలు ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories