Parenting Tips: తల్లిదండ్రులు పిల్లల ముందు ఈ పనులు అస్సలు చేయవద్దు..!

Parents Should not do These Things in Front of Children
x

Parenting Tips: తల్లిదండ్రులు పిల్లల ముందు ఈ పనులు అస్సలు చేయవద్దు..!

Highlights

Parenting Tips: ఇంట్లో తల్లిదండ్రుల మధ్య రకరకాల విషయాల్లో గొడవలు జరుగుతుంటాయి.

Parenting Tips: ఇంట్లో తల్లిదండ్రుల మధ్య రకరకాల విషయాల్లో గొడవలు జరుగుతుంటాయి. కొంతమంది ఈ విషయంలో తెలివిగా వ్యవహరిస్తారు. తమ గొడవలని పిల్లల ముందు బయటకు రానివ్వరు. కాగా కొందరు తల్లిదండ్రులు తెలియక పిల్లల ముందే గొడవ పడుతుంటారు. దీనివల్ల పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. వారు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయే అవకాశాలు ఉంటాయి. తల్లిదండ్రుల ప్రవర్తన వల్ల పిల్లలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారో ఈ రోజు తెలుసుకుందాం.

పిల్లలు నిరాశలో మునిగిపోతారు

ఎప్పుడైతే తల్లిదండ్రులు పిల్లల ముందు అరవడం, కొట్లాడుకోవడం మొదలుపెడతారో అప్పుడు పిల్లలు నిరాశలో మునిగిపోతారు. వారిని చూస్త భయం కలుగుతుంది. ఇది వారి నమ్మకాన్ని వమ్ము చేస్తోంది. దీంతో వారు మునుపటి కంటే ప్రశాంతంగా లేదా కోపంగా మారుతారు. కొంతమంది పిల్లల స్వభావంలో చిరాకు మొదలవుతుంది. ఇది జీవితాంతం వారితోనే ఉంటుంది.

మానసికంగా కలవరపడతారు

పిల్లల ముందు పోట్లాడుకునే పేరేంట్స్‌ వల్ల పిల్లలు మానసికంగా కుంగిపోతారు. ఇంట్లో అంతా తప్పు జరుగుతోందని భావిస్తారు. వారికి నిద్రపట్టడంలో ఇబ్బంది మొదలవుతుంది. నిద్రపోయిన కొంతసేపటికే మెలకువ వస్తుంది. ఇలాంటి పిల్లలు నిద్రలేమికి గురవుతారు.

గౌరవించడం మానేస్తారు

తల్లిదండ్రుల ఈ రకమైన ప్రవర్తన పిల్లలలో అసహనానికి కారణమవుతుంది. దీంతో తల్లిదండ్రులను గౌరవించడం మానేస్తారు. వారిపట్ల నెగిటివ్‌ ఆలోచనలు వారి మనసులో మెదలుతాయి. ఇది వారిని ముందుకు సాగకుండా చేస్తుంది. అలాంటి పిల్లలు చాలా విసుగు చెంది మానసికంగా ఇబ్బందిపడుతారు.

ఆహారం పట్ల ఆసక్తి తగ్గుతుంది

తల్లిదండ్రుల గొడవలు చూసి పిల్లలు సరిగ్గా తిండి కూడా తినలేరు. ఆహారం పట్ల ఆసక్తి తగ్గుతుంది. ఒకవేళ అయిష్టంగా, బలవంతంగా తింటారు. తల్లితండ్రుల ఒత్తిడితో నోటిలో ఆహారం పెట్టుకున్నా నమలకుండా మింగుతారు. ఈ అలవాటు వారికి ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories