Papaya Health Benefits: ఇమ్యూనిటీ బూస్టర్ గా బొప్పాయి

Papaya as an Immunity Booster
x

Papaya Health Benefits:(File Image)

Highlights

Papaya Health Benefits: వ్యాధి నిరోధక శక్తి పెంచుకునేందుకు బొప్పాయి చక్కగా ఉపయోగపడుతుంది.

Papaya Health Benefits: బొప్పాయి పండు ఇది అందరికీ తెలిసిన పండే. కానీ చాలా మంది ఆరోగ్య పరంగా మంచిదని తింటూ వుంటారు. మరి కొంత మంది అస్సలు ఆ వాసనే పడదు అని అంటూ దూరంగా పెట్టేస్తారు. మరి బొప్పాయి తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలని ఆరో్గ్య నిపుణులు సూచిస్తున్నారు. అస్సలు ఆ పండులో వుండే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మన "లైఫ్ స్టైల్" లో చూద్దాం.

బొప్పాయిలోని ప్లేవనాయిడ్స్‌, పొటాషియం, మినరల్స్‌, కాపర్‌, మెగ్నిషియం, ఫైబర్‌ వంటి పోషకాలు మనకు ఎంతో మేలు చేస్తాయి. బొప్పాయిలో విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. కరోనా రాకుండా వ్యాధి నిరోధక శక్తి పెంచుకునేందుకు కూడా ఉపయోగపడుతుంది. భోజనం తర్వాత బొప్పాయి తింటే ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. పొట్ట, పేగుల్లో విషపదార్థాల్ని తొలగిస్తుంది. బొప్పాయి ఆకుల రసం తాగితే కూడా... ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. బొప్పాయిలో విటమిన్‌ సి, యాంటీఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి.

డెంగీ ఫీవర్‌తో బాధపడేవారికి ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. అలాంటి వారు తప్పనిసరిగా బొప్పాయి తినాలి. ఫలితంగా ప్లేట్ లెట్స్ మళ్లీ వేగంగా పెరుగుతాయి. బొప్పాయి ఆకుల రసం తాగినా చక్కటి ఫలితం ఉంటుంది. బొప్పాయిలో క్యాలరీలు తక్కువే. అందువల్ల ఎక్కువగా తిన్నా బరువు పెరిగే ప్రమాదం ఉండదు. పైగా... ఇది చెడు కొవ్వును తరిమేస్తుంది. గుండెకు రక్తం చక్కగా సరఫరా అయ్యేలా చేస్తుంది.మూత్ర పిండాల్లో రాళ్లు ఉండేవారికి బొప్పాయి సరైన మందు. బొప్పాయి రెగ్యులర్‌గా తింటే, మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను అరికట్టవచ్చు.

బొప్పాయిలో బీటాకెరోటిన్‌, లూటిన్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కాన్సర్‌ వైరస్‌తో పోరాడతాయి. ఇది కొలన్‌, గర్భాశయ కాన్సర్‌లను తగ్గిస్తుంది. నారింజ, యాపిల్‌ కంటే బొప్పాయిలో విటమిన్‌ 'ఇ' చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మన స్కిన్ సున్నితంగా, మృదువుగా, కోమలంగా మారడానికి బొప్పాయి ఉపయోగపడుతుంది. బొప్పాయిలోని తెల్లని గుజ్జుని ముఖానికి రాయడం వల్ల మంచి మెరుపు రావడంతో పాటు మొటిమలూ తగ్గుతాయి. బొప్పాయి ఫేస్‌ప్యాక్‌ జిడ్డు చర్మానికి ఎంతో మంచిది.

యుక్తవయస్సులో ఉన్నవారు దోరగా పండిన పండును తినవచ్చు. క్యాలరీలు తక్కువగా వుంటాయి. అందుకే స్థూలకాయులు సైతం హాయిగా బొప్పాయిని తినొచ్చు కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బిటాకెరోటిన్‌ తోడ్పడుతుంది. బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్ సి దంతాల, చిగుళ్ళ ఆరోగ్యానికి, రక్తవృద్ధికి, రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది. విటమిన్‌ బి నోటి పూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా కాపాడుతుంది.

మామిడి పండు తర్వాత బొప్పాయిలోనే మనకు అధిక పరిమాణంలో విటమిన్ ఎ లభిస్తుంది. దీని వలన కొన్ని రకాల జబ్బులను కూడ తగ్గించవచ్చు.పచ్చికాయ అధిక రక్తపోటుని నియంత్రిస్తుంది. బొప్పాయి మంచి సౌందర్యసాధనం కూడా పనిచేస్తుంది. రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచటం,రోగనిరోధక శక్తిని పెంచటంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

ఇందులో బీటా కెరోటిన్ అనే పదార్థం ఉండటం వలన కంటికి సంబంధించిన అనేక రకాల వ్యాధులు రాకుండా కాపాడుతుంది. బొప్పాయి పండులో విటమిన్ ఏ అధిక శాతంలో ఉంటుంది. అలాగే ఇందులో కాల్షియం,భాస్వరం,మెగ్నిషియం వంటివి కూడా ఎక్కువ మోతాదులో లభిస్తాయి. బొప్పాయిలో ఉండే పెప్పీన్ అనేప్రదార్థం జీర్ణక్రియకు సంబంధించిన మందులు తయారు చేయటంలో వాడుతున్నారు. దీనిలో ఉండే పీచు వలన అర్శమొలలు రాకుండా కాపాడుతుంది. ఆస్తమా మరియు కీళ్లనొప్పులు తగ్గిస్తుంది.

గమనిక: గర్భవతులు మాత్రం బొప్పాయికి దూరంగా వుండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories