Oversleeping: అతి నిద్ర వల్ల అన్నీ నష్టాలే.. ఆరోగ్యానికి చాలా హాని..!

Oversleeping Is Dangerous To Health Many Diseases Will Occur
x

Oversleeping: అతి నిద్ర వల్ల అన్నీ నష్టాలే.. ఆరోగ్యానికి చాలా హాని..!

Highlights

Oversleeping: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజులో అతడికి కచ్చితంగా విశ్రాంతి అవసరం. అప్పుడే అతడు మరునాడు చురుకుగా ఉంటాడు.

Oversleeping: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజులో అతడికి కచ్చితంగా విశ్రాంతి అవసరం. అప్పుడే అతడు మరునాడు చురుకుగా ఉంటాడు. లేదంటే బలహీనంగా, నీరసంగా కనిపిస్తాడు. ఆరోగ్యకరమైన పెద్దలు రోజూ 7 నుంచి 8 గంటలు కచ్చితంగా నిద్రపోవాలి. ఇలా చేయడం వల్ల రోజంతా అలసట తొలగిపోయి తాజాగా అనిపిస్తుంది. తక్కువ నిద్ర ఆరోగ్యానికి మంచిది కాదని అందరికి తెలుసు, అలాగే అతి నిద్ర కూడా ఆరోగ్యానికి హానికరం. అతిగా నిద్రించడం వల్ల కలిగే నష్టాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

1. గుండె జబ్బులు

మీరు రోజులో 8 గంటల నిద్ర తర్వాత కూడా మేల్కొనకపోతే అలారం లేదా కుటుంబ సభ్యుల సహాయం తీసుకోండి. ఎందుకంటే ఎక్కువసేపు నిద్రపోతే గుండె ప్రమాదంలో పడుతుంది. ఇది కరోనరీ ఆర్టరీ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది.

2. తలనొప్పి

తగినంత నిద్ర తీసుకుంటే అలసట, తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. కానీ ఎక్కువగా నిద్రపోయే అలవాటు ఉంటే తలనొప్పి మరింత పెరుగుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా ఈ చెడు అలవాట్లను వదిలించుకోండి.

3. డిప్రెషన్

తక్కువ నిద్రపోవడం వల్ల ఒత్తిడికి లోనవుతారని అందరికి తెలుసు. కానీ ఎక్కువ నిద్రపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. నిద్రను అదుపు చేసుకోలేని వ్యక్తులు తరచుగా డిప్రెషన్‌కు గురవుతారు.

4. స్థూలకాయం

పరిమితికి మించి నిద్రపోయినప్పుడు శారీరక శ్రమలకు సమయం దొరకదు. ఈ పరిస్థితుల్లో పొట్టలో, నడుము చుట్టూ, కొవ్వు పెరుగుతుంది. తరువాత ఇది మధుమేహం, అధిక రక్తపోటుకు కారణమవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories