Healthy Heart: అధిక కొలెస్ట్రాల్‌తో ఇబ్బందులా.. ఆహారంలో ఈ ఒక్కటి చేర్చితే చాలు.. గుండె సమస్యలకు చెక్..!

Olive Oil Good for Healthy Heart Check Health Benefits of Olive Oil
x

Healthy Heart: అధిక కొలెస్ట్రాల్‌తో ఇబ్బందులా.. ఆహారంలో ఈ ఒక్కటి చేర్చితే చాలు.. గుండె సమస్యలకు చెక్..!

Highlights

Health Tips: ఆహారపు అలవాట్లలో మార్పులు, సరైన జీవనశైలిని పాటించకపోవడం వల్ల అనేక రకాల వ్యాధులు పెరుగుతున్నాయి. వీటిలో ఒకటి అధిక కొలెస్ట్రాల్. వేయించిన, ఫాస్ట్ ఫుడ్, మసాలాలు ఎక్కువగా తినడం వల్ల మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది.

Health Tips: ఆహారపు అలవాట్లలో మార్పులు, సరైన జీవనశైలిని పాటించకపోవడం వల్ల అనేక రకాల వ్యాధులు పెరుగుతున్నాయి. వీటిలో ఒకటి అధిక కొలెస్ట్రాల్. వేయించిన, ఫాస్ట్ ఫుడ్, మసాలాలు ఎక్కువగా తినడం వల్ల మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం మరింత పెరుగుతుంది. అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఆలివ్ నూనెను కూడా తీసుకోవచ్చు. దీన్ని మీ డైట్‌లో ఎలా చేర్చుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆలివ్ ఆయిల్ వల్ల కలిగే ప్రయోజనాలు?

ఆలివ్ నూనె మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణిస్తుంటాంరు. ఇందులో ఉండే గుణాలు గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఆలివ్ ఆయిల్‌‌ను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల అధిక కొలెస్ట్రాల్ సమస్య నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఆలివ్ ఆయిల్‌లో ఉన్నాయి. ఇది కొలెస్ట్రాల్ వల్ల కలిగే మంటను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. విటమిన్-ఇ, విటమిన్-ఏ, విటమిన్-డి మంచి మొత్తంలో ఆలివ్ నూనెలో లభిస్తాయి.

ఆహారంలో ఎలా చేర్చాలి?

ఆలివ్ నూనెను అనేక విధాలుగా ఆహారంలో చేర్చుకోవచ్చు. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నట్లయితే, ఆహారంలో ఆలివ్ నూనెను చేర్చుకోవచ్చు. మీరు ఆలివ్ నూనెతో కూరలను సిద్ధం చేసుకోవచ్చు. అలాగే క్రమం తప్పుకుండా ఆలివ్ నూనెను తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

అధిక కొలెస్ట్రాల్ కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం..

అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అధిక కొలెస్ట్రాల్ కారణంగా, గుండెపోటు, గుండె ఫెయిల్యూర్ వంటి అనేక గుండె సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా, అధిక కొలెస్ట్రాల్ సమస్యను నివారించవచ్చు. ఇందుకోసం వెల్లుల్లి, విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు, బ్రౌన్ రైస్ తినవచ్చు.

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఈ నూనెలో కనిపిస్తాయి. ఇవి మంటను తగ్గించడంలో, కొలెస్ట్రాల్‌ను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

ఇది కాకుండా, ఆలివ్ నూనె రక్తనాళాల పనితీరును, గుండె ఆరోగ్యాన్ని అలాగే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఈ నూనెలో అధిక మొత్తంలో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇది మెరుగైన లిపిడ్ ప్రొఫైల్, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఆలివ్ నూనెలో ఉండే పాలీఫెనాల్స్ గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఇది కాకుండా ఈ నూనె అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అంటే ఇందులో ఉండే పాలీఫెనాల్, మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ రక్తపోటును నియంత్రిస్తాయి.

ఆలీవ్ నూనెతో ఆహారాన్ని వండుకోవాలి. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories