Soaked Raisins: నానబెట్టిన ఎండు ద్రాక్షలో పోషకాలు అధికం.. వేసవిలో శరీరానికి ఈ ప్రయోజనాలు..!

Nutrients Are High In Soaked Raisins The Body Gets These Benefits In Summer
x

Soaked Raisins: నానబెట్టిన ఎండు ద్రాక్షలో పోషకాలు అధికం.. వేసవిలో శరీరానికి ఈ ప్రయోజనాలు..!

Highlights

Soaked Raisins: ఈ సీజన్‌లో ద్రాక్షపండ్లు ఎక్కువగా లభిస్తాయి. ధర కూడా తక్కువగా ఉంటుంది. ద్రాక్షలో రెండు రకాలు ఉంటాయి.

Soaked Raisins: ఈ సీజన్‌లో ద్రాక్షపండ్లు ఎక్కువగా లభిస్తాయి. ధర కూడా తక్కువగా ఉంటుంది. ద్రాక్షలో రెండు రకాలు ఉంటాయి. ఎండబెట్టిన ద్రాక్ష, పచ్చి ద్రాక్ష కానీ ఎండినవి డ్రైఫ్రూట్స్‌ షాప్‌లో లభిస్తాయి. పచ్చివి మాత్రం ఫ్రూట్‌ మార్కెట్‌లో లభిస్తాయి. అయితే ఈ రెండు ఆరోగ్యానికి మంచివే. కానీ ఎండుద్రాక్షలో పోషకాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని రాత్రిపూట నీళ్లలో నానబెట్టి ఉదయమే పరగడుపున తాగాలి. దీనివల్ల చర్మానికి, జుట్టుకు చాలా మంచిది. ఈ రోజు ద్రాక్ష ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

ద్రాక్షలో ఉండే పోషకాలు

ఎండుద్రాక్ష పోషక విలువల పరంగా చాలా గొప్పది. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్ బి-6, మాంగనీస్, ఐరన్, పొటాషియం, కాపర్ వంటి పోషకాలు ఇందులో ఉంటాయి. నీటిలో నానబెట్టి తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మరింతగా పెరుగుతాయి.

రోగ నిరోధక శక్తి బలపడుతుంది

ఎండుద్రాక్షలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ నానబెట్టి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధులు, ఫ్లూ మొదలైన వాటి నుంచి బయటపడుతారు.

రక్తహీనతను నివారించడం

ఎండుద్రాక్షలో పెద్ద మొత్తంలో ఐరన్ లభిస్తుంది. దీని వినియోగం హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. శరీరంలో రక్త లోపం ఉండదు. రక్తహీనతతో బాధపడేవారు రోజూ ఉదయాన్నే ఎండు ద్రాక్షను తీసుకోవాలి.

గుండె ఆరోగ్యం కోసం

ఎండుద్రాక్షలో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది రక్తపోటును మెయింటెన్‌ చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. తద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఎండుద్రాక్ష జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనివల్ల అజీర్ణం, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యల నుంచి బయటపడుతారు.

బరువు తగ్గడంలో సహాయపడుతుంది

ప్రతిరోజూ ఉదయం కొద్దిగా నానబెట్టిన ఎండుద్రాక్ష నీటిని తాగడం వల్ల బరువు తగ్గుతారు. ఉదయాన్నే నానబెట్టిన ఎండుద్రాక్షను తినవచ్చు. అయితే ఎండుద్రాక్ష అధికంగా తీసుకుంటే బరువు పెరుగుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories