Potato Peel Health Benefits: ఆలుగడ్డ పొట్టులో ఉండే పోషకాలు గడ్డలో ఉండవంట..!

Nutrients are high in potato peel Know medicine for many diseases
x

Potato Peel Health Benefits: ఆలుగడ్డ పొట్టులో ఉండే పోషకాలు గడ్డలో ఉండవంట..!

Highlights

Potato Peel Health Benefits: ఆలుగడ్డ కూర అంటే అందరికీ ఇష్టమే.. ఎంతో ఇష్టంగా తింటారు. ఇక ఆలు ఫ్రై చేస్తే చెప్పనవసరం లేదు ఓ పట్టు పట్టేస్తారు.

Potato Peel Health Benefits: ఆలుగడ్డ కూర అంటే అందరికీ ఇష్టమే.. ఎంతో ఇష్టంగా తింటారు. ఇక ఆలు ఫ్రై చేస్తే చెప్పనవసరం లేదు ఓ పట్టు పట్టేస్తారు. ఆలుతో రకరకాల వంటలు చేయవ చ్చు. అంతేకాదు అందరికి ఎంతో ఇష్టమైన చిప్స్‌ కూడా వీటితోనే తయారుచేస్తారు. ఆలుగడ్డలో చాలా పోషకాలు ఉంటాయి. ఇవి అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతాయి. అయితే ఇటీవల ఆలు లోపలి గడ్డలో కంటే పైన ఉండే తొక్కలోనే చాలా పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే అది ఎంతవరకు నిజమో ఈ రోజు తెలుసుకుందాం.

ఆలు కూర వండే టప్పుడు చాలామంది పైన తొక్కను తీసేసి వండుతారు. ఇలా చెయ్యడం వల్ల చాలా పోషకాలు మిస్సవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఆలు తొక్కపై అంతా మట్టి, దుమ్ము ఉంటాయి కనుక పొట్టును తీసేయాల్సి వస్తుంది. అయితే వాస్తవానికి ఆలూను పొట్టుతో సహా తినాలి. పొట్టులో అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్ ఉంటుంది. పొట్టులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది హైబీపీని తగ్గిస్తుంది. నాడీ వ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది.

ఆలు పొట్టులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఫ్లేవనాయిడ్స్‌, కెరోటినాయిడ్స్‌, ఫినోలిక్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్, నాడీ సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతాయి. ఆర్థరైటిస్‌, కీళ్లు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. అధిక బరువు సమస్య నుంచి బయట పడతారు. మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. అందుకే ఇప్పటి నుంచైనా ఆలుగడ్డ తొక్కతో వండుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే విలువైన పోషకాలు మిస్సవుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories