Strawberries Benefits: స్ట్రాబెర్రీలో పోషకాలు పుష్కలం.. మందులకి తగ్గని ఈ 2 వ్యాధులు దూరం..!

Nutrients Are Abundant In Strawberries These Benefits Are Provided To The Body
x

Strawberries Benefits: స్ట్రాబెర్రీలో పోషకాలు పుష్కలం.. మందులకి తగ్గని ఈ 2 వ్యాధులు దూరం..!

Highlights

Strawberries Benefits: రోజువారీ డైట్‌లో కచ్చితంగా సీజనల్‌ పండ్లని చేర్చుకోవాలి. అప్పుడే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారు.

Strawberries Benefits: రోజువారీ డైట్‌లో కచ్చితంగా సీజనల్‌ పండ్లని చేర్చుకోవాలి. అప్పుడే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారు. ఏ సీజన్‌లో లభించే పండ్లని ఆ సీజన్‌లో కచ్చితంగా తినాలి. దీనివల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే అన్ని సీజన్‌లలో లభించే పండ్లు కూడా ఉంటాయి. ఇవి కూడా శరీరానికి చాలా మేలు చేస్తాయి. అందులో ఒకటి స్ట్రాబెర్రీలు. ఇవి తీపి, పుల్లని రుచిని కలిగి ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు ఇందులో ఉంటాయి. ఈ రుచికరమైన పండు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ రోజు తెలుసుకుందాం.

స్ట్రాబెర్రీలలో లభించే పోషకాలు

స్ట్రాబెర్రీలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరంలోని అనేక సమస్యలను దూరం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

స్ట్రాబెర్రీలో క్యాన్సర్ నివారణ లక్షణాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ను నిరోధించడంలో సహాయపడుతాయి. ఇందులో ఉండే విటమిన్-సి దంతాలపై పేరుకుపోయిన పసుపు రంగుని తొలగించి ఎంజైమ్‌లు ఏర్పడకుండా చేస్తుంది. స్ట్రాబెర్రీలో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో పాలీఫెనాల్స్ సమ్మేళనం పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.

స్ట్రాబెర్రీలో ఫైబర్‌తో పాటు అనేక పోషకాలు ఉంటాయి. ఇవి కాకుండా వీటిలో పెద్ద మొత్తంలో నీరు కూడా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం స్ట్రాబెర్రీలను సలాడ్ లేదా పెరుగుతో కలిపి తినవచ్చు. ఇది కాకుండా టిఫిన్‌ సమయంలో తినవచ్చు. అలాగే ఈ పండును నేరుగా కూడా తినవచ్చు. కొంతమంది షేక్స్ లేదా జ్యూస్‌లలో వేసుకొని తీసుకుంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories