Health Tips: తల్లిదండ్రులకి ముఖ్య గమనిక.. పిల్లలకి ఈ తీపి తినిపిస్తే ఇమ్యూనిటీ పవర్‌ అధికం..!

Note To Parents Feeding Honey To Children Prevents Infections
x

Health Tips: తల్లిదండ్రులకి ముఖ్య గమనిక.. పిల్లలకి ఈ తీపి తినిపిస్తే ఇమ్యూనిటీ పవర్‌ అధికం..!

Highlights

Health Tips: వర్షాకాలంలో పిల్లలు తరచుగా వ్యాధులకి గురవుతారు. దీనికి కారణం రోగనిరోధక శక్తి తగ్గిపోవడమే.

Health Tips: వర్షాకాలంలో పిల్లలు తరచుగా వ్యాధులకి గురవుతారు. దీనికి కారణం రోగనిరోధక శక్తి తగ్గిపోవడమే. ఇలాంటి పరిస్థితుల్లో తల్లితండ్రులు అలర్ట్‌గా ఉండాలి. ఇమ్యూనిటి పవర్‌ పెంచే ఆహారపదార్థాలని వారికి అందించాలి. అందులో ముఖ్యమైనది తేనె. ప్రతిరోజు రెండు చెంచాల తేనె తినిపిస్తే ఇన్‌ఫెక్షన్స్‌ రాకుండా ఉంటాయి. ఇది వారి ఆరోగ్యానికి మేలు చేస్తుంది అనేక వ్యాధుల నుంచి కాపాడుతుంది. తేనె పిల్లలకు ఎలా ఉపయోగపడుతుందో ఈరోజు తెలుసుకుందాం.

జీర్ణక్రియ సవ్యంగా

పిల్లలకు రోజూ ఒకటి నుంచి రెండు చెంచాల తేనెను తినిపిస్తే వారి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది . అంటు వ్యాధులను నివారించడం సులభం అవుతుంది. పిల్లలు తరచుగా బయట స్పైసీ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. దీని కారణంగా వారికి సరైన పోషకాహారం లభించదు. అంతేకాకుండా కడుపుకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. ఈ పరిస్థితిలో తేనె వారికి ఔషధం కంటే తక్కువేమి కాదు. ఈ స్వీట్‌లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు మలబద్ధకం సమస్యను దూరం చేస్తాయి.

గుండె ఆరోగ్యానికి మంచిది

పిల్లలకు గుండె జబ్బులు తక్కువగా వస్తాయి. కానీ కచ్చితంగా రావని మాత్రం చెప్పలేము. కాబట్టి ఆరోగ్యకరమైన గుండె కోసం తేనె తినిపించడం అలవాటు చేయాలి. దీనివల్ల భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

జలుబు, దగ్గు నివారణ

శీతాకాలంలో పిల్లలు నిద్రించేటప్పుడు దుప్పట్లను సరిగ్గా కప్పుకోరు. దీని కారణంగా వారు జలుబుకి గురవుతారు. ఈ పరిస్థితిలో క్రమం తప్పకుండా తేనెను తినిపిస్తే రోగనిరోధక శక్తి పెరిగి దగ్గు, జలుబు త్వరగా తగ్గుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories