Guava Leaves Benefits: జామపండు మాత్రమే కాదు ఆకులు కూడా ఔషధాలే.. ఈ సమస్యలకి చక్కటి పరిష్కారం..!

Not only Guava Fruit but also the Leaves are Medicines you will be Surprised if you Know the Benefits
x

Guava Leaves Benefits: జామపండు మాత్రమే కాదు ఆకులు కూడా ఔషధాలే.. ఈ సమస్యలకి చక్కటి పరిష్కారం..

Highlights

Guava Leaves Benefits: జామపండుని ప్రతి ఒక్కరు ఇష్టపడుతారు. దీనిని పేదవాడి యాపిల్‌గా పిలుస్తారు. అన్ని వయసులవారు తినవచ్చు.

Guava Leaves Benefits: జామపండుని ప్రతి ఒక్కరు ఇష్టపడుతారు. దీనిని పేదవాడి యాపిల్‌గా పిలుస్తారు. అన్ని వయసులవారు తినవచ్చు. జామ ఎరుపు, తెలుపు రంగులలో లభిస్తుంది. ఈ పండు జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. అలాగే జామ ఆకులు కూడా దివ్యవౌషధంగా చెప్పవచ్చు. ఇందులో ఉండే గుణాలు తెలిస్తే వీటిని అస్సలు వదలరు. ఇవి చాలా ఆరోగ్య సమస్యలని నయం చేస్తాయి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

జామ ఆకులలో లభించే పోషకాలు

జామ ఆకుల్లో అనేక పోషకాలు ఉంటాయి. క్యాల్షియం, పొటాషియం, సల్ఫర్, సోడియం, ఐరన్, బోరాన్, మెగ్నీషియం, మాంగనీస్ వంటి ఖనిజాలతో పాటు విటమిన్ బి, విటమిన్ సి అధిక మోతాదులో లభిస్తాయి.

జామ ఆకుల ఉపయోగాలు

1. జామ ఆకులను పంటి నొప్పికి ఔషధంగా ఉపయోగించవచ్చు. జామ ఆకులను లవంగాలతో మెత్తగా నూరి దంతాలపై లేదా చిగుళ్లపై రాసుకుంటే నొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

2. జామ ఆకులలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి సిరల్లోని చెడు కొలెస్ట్రాల్, పొట్టలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతాయి. ఈ ఆకులను గ్రైండ్ చేసి వాటి నుంచి వచ్చిన సారం తాగాలి. దీని ద్వారా ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు.

3. టైప్-2 మధుమేహ వ్యాధిగ్రస్తులకు జామ ఆకులు ప్రయోజనకరంగా చెప్పవచ్చు. వీటి రసం తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిని మెయింటెన్ చేయవచ్చు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణించదు.

4. జామ ఆకుల సారం కడుపుకు చాలా మంచిది. జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుందని అనేక పరిశోధనల్లో రుజువైంది. అతిసారం, గ్యాస్ సమస్య ఉంటే ఖచ్చితంగా ఈ ఆకుల సారాన్ని తీసుకోవడం ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories