పండ్ల వల్ల అన్నీ లాభాలే కాదు.. కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.. అవేంటంటే..?

Not all Fruits are Profitable There are also Some Disadvantages | Healthy Fruit Facts
x

పండ్ల వల్ల అన్నీ లాభాలే కాదు.. కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.. అవేంటంటే..?

Highlights

Fruits Disadvantages: ప్రతిరోజు మనం పండ్లను తింటాం. అంతేకాదు వైద్యులు కూడా ఎల్లప్పుడు పండ్లు తినమని సూచిస్తారు...

Fruits Disadvantages: ప్రతిరోజు మనం పండ్లను తింటాం. అంతేకాదు వైద్యులు కూడా ఎల్లప్పుడు పండ్లు తినమని సూచిస్తారు. వాస్తవానికి ప్రతిరోజు పండ్లు తింటే డాక్టర్ వద్దకు వెళ్లవలసిన అవసరం ఉండదు. ఏ సీజన్‌లో దొరికే పండు ఆ సీజన్‌లో పండ్లలో చాలా పోషకాలు ఉంటాయి. విటమిన్స్‌, ప్రొటీన్స్‌, మినరల్స్‌ ఇంకా చాలా ఉంటాయి. బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి పండ్లు చాలా సహాయం చేస్తాయి.

కానీ ఆధునిక కాలంలో పండ్ల వల్ల కూడా కొన్ని నష్టాలు ఉన్నాయి. ఇవి తెలుసుకోకపోతే అనారోగ్యానికి గురికావలసి ఉంటుంది. పండ్ల అతి పెద్ద లక్షణం ఏంటంటే వాటిని ఉడికించకూడదు. పండ్లు ప్రకృతిలో ఏ రూపంలో దొరుకుతాయో అదే రూపంలో తినాలి. చెట్టు నుంచి నేరుగా తిన్న పండు భలే టేస్ట్ ఉంటుంది. మూడు దశాబ్దాల క్రితం పండ్లను పండించే విధానం వేరుగా ఉండేది. కానీ నేడు మార్కెట్‌లో అమ్ముడవుతున్న పండ్లలో పెద్ద మొత్తంలో పురుగుమందులు వివిధ రకాల రసాయనాలు కలిసి ఉంటున్నాయి.

అవి శరీరానికి ప్రయోజనం కంటే ఎక్కువ హాని చేస్తున్నాయి. కూరగాయలలో పురుగుమందులు, రసాయనాలు ఉపయోగిస్తారు అయితే అవి వండుకుని తినడం వల్ల అందులో ఉండే పురుగుమందుల ప్రభావం కొంత వరకు తగ్గుతుంది.పండ్ల విషయంలో అలా కాదు. వాటిని ఉడికించలేము. పచ్చిగానే తినాలి. దీంతో ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో ఇవి చాలా ప్రభావం చూపుతున్నాయి.

వీలైనంత వరకు పురుగుమందులు, యూరియా వాడకుండా సేంద్రియ పద్ధతిలో పండించిన పండ్లను మాత్రమే తీసుకోవాలి. సేంద్రీయ పండ్లు అందుబాటులో లేకుంటే పండ్లను తినవద్దు. ఒకవేళ తప్పదు అనుకుంటే పండ్లను తినడానికి ముందు వాటిని కనీసం ఒక గంట పాటు నీటిలో నానబెట్టి, తినడానికి ముందు వాటిని బాగా కడిగి తినాలి. దీని వల్ల దాని బయటి చర్మంపై ఉండే పురుగుమందులు, రసాయనాల ప్రభావం కొంతమేరైనా తగ్గుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories