Home remedies: కడుపుబ్బరం, గ్యాస్, అజీర్తి, మలబద్ధకం ఇబ్బంది పెడుతోందా? సింపుల్‌ చిట్కాలతో చెక్‌

Home remedies: కడుపుబ్బరం, గ్యాస్, అజీర్తి, మలబద్ధకం ఇబ్బంది పెడుతోందా? సింపుల్‌ చిట్కాలతో చెక్‌
x
Highlights

Natural tips to overcome from gas and acidity problems: మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం... ఇలా కారణాలు...

Natural tips to overcome from gas and acidity problems: మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం... ఇలా కారణాలు ఏవైనా... ఇటీవల చాలా మంది పొట్ట ఉబ్బరం సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా కడుపుబ్బరం, గ్యాస్, అజీర్తి, మలబద్ధకం ఇలా ఎన్నో సమస్యలు సర్వసాధారణంగా మారాయి. అయితే ఇలాంటి సమస్యలకు కొన్ని నేచురల్‌ చిట్కాలు దివ్యౌషధంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

* అజీర్తి, గ్యాస్‌ వంటి సమస్యలకు పెరుగు మంచి రెమెడీగా చెప్పొచ్చు. ఇందులోని ప్రో బయోటిక్‌ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. పెరుగుతో జీర్ణక్రియ మెరుగవుతుంది. భోజనం చేసిన తర్వాత చివరిలో పెరుగుతో కొంత తింటే ఎసిడిటీ సమస్య దూరమవుతుంది. మజ్జిగ రూపంలో తీసుకున్నా మంచి జరుగుతుందని పౌష్టికాహార నిపుణులు చెబుతున్నారు.

* ఇక కొబ్బరి నీరు కూడా పొట్టలో ఎదురయ్యే సమస్యలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కొబ్బరి నీటిని రెగ్యులర్‌గా తీసుకోవం వల్ల ఎసిడిటీ సమస్య నుంచి బటయకు పడొచ్చు. భోజనం చేసే ముందు కొబ్బరి నీరు తాగితే కడుపు సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

* కడుపులో ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో సోంపు, జీలకర్ర నీరు ఉపయోగపడతాయి. ఇందుకోసం ఒక స్పూన్ సోంపు, ఒక స్పూన్ జీలకర్రను నీటిలో ఉడికించాలి. ఇలా ఏ రోజుకు ఆ రోజు తాజాగా తయారు చేసుకున్న నీటిని రోజూ ఉదయం పడిగడుపున తీసుకుంటే గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలను ప్రాథమిక సమాచారంగా మాత్రమే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories