Health: తరచుగా ముక్కుదిబ్బడతో బాధపడుతున్నారా.. క్యాన్సర్ ప్రమాదం..?

Health: తరచుగా ముక్కుదిబ్బడతో బాధపడుతున్నారా.. క్యాన్సర్ ప్రమాదం..?
x

Health: తరచుగా ముక్కుదిబ్బడతో బాధపడుతున్నారా.. క్యాన్సర్ ప్రమాదం..?

Highlights

Health: తరచుగా ముక్కుదిబ్బడతో బాధపడుతున్నారా.. క్యాన్సర్ ప్రమాదం..?

Health: చలికాలం వాతావరణం మారినప్పుడు జలుబుతో ముక్కు ఒకవైపు మూసుకుపోవడం సాధారణంగా అందరిలో జరుగుతుంది. రెండు మూడు రోజుల తర్వాత మళ్లీ దానంతట అదే తెరుచుకుంటుంది. ఒకవేళ చాలా రోజులు అలాగే ఉంటే అది మీకు ప్రమాదకరం. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ లక్షణం ముక్కు క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. దీనిని నాసోఫారింజియల్ క్యాన్సర్ (NPC) అంటారు.

ముక్కు క్యాన్సర్ సైలెంట్ కిల్లర్

ది సన్ నివేదిక ప్రకారం.. ముక్కులో క్యాన్సర్ ఏర్పడటం ఒక రకమైన సైలెంట్ కిల్లర్. ఒక వ్యక్తి ఈ విషయం తెలుసుకునే సమయానికి చాలా ఆలస్యం జరుగుతుంది. అప్పటికే అతడు మృత్యువు దరికి చేరుకుంటాడు. అయితే మీరు ఈ విషయం ముందుగా తెలుసుకుంటే జాగ్రత్తలు తీసుకోవచ్చు. శరీరంలోని కొన్ని ప్రత్యేక లక్షణాల ద్వారా మీకు ఈ వ్యాధి ఉందా లేదా అని తెలుస్తుంది. ఆ లక్షణాలు ఏంటో తెలుసుకుందాం.

ముక్కు క్యాన్సర్ నాసోఫారింజియల్ క్యాన్సర్ (NPC) అని కూడా అంటారు. ఇది ముక్కు వెనుక ఉన్న ఫారింక్స్ (గొంతు) ఎగువ భాగంలో ఏర్పడుతుంది. UKలో ప్రతి సంవత్సరం 260 మంది నాసోఫారింజియల్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. చాలా సందర్భాలలో ప్రజలు క్యాన్సర్ లక్షణాలను ప్రారంభంలో గుర్తించరు. దీంతో ఈ వ్యాధి తదుపరి దశలోకి ప్రవేశిస్తుంది.

ముక్కు క్యాన్సర్ లక్షణాలు

మెడలో ఏదైనా గడ్డ ఏర్పడటం, ఇది 3 వారాల తర్వాత కూడా తగ్గకపోవడం జరుగుతుంది. ఒక చెవిలో వినికిడి లోపం ఉంటుంది. ముక్కు శ్లేష్మంతో నిండి ఉంటుంది. ధనుర్వాతం ఏర్పడుతుంది. ముక్కు నుంచి రక్తస్రావం జరుగుతుంది. తరచూ తలనొప్పి ఉంటుంది. అస్పష్టమైన కంటిచూపు, ముఖం దిగువ భాగంలో తిమ్మిరి, ఆహారం మింగలేకపోవడం, గొంతు బొంగురుపోవడం, అనుకోకుండా బరువు తగ్గడం వంటివి జరుగుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories