Health Tips: బొప్పాయి గింజల్లో ఔషధగుణాలు.. ఈ వ్యాధులకు చక్కటి నివారణ..!

Medicinal Properties of Papaya Seeds Relieve These Diseases Along with Cancer
x

Health Tips: బొప్పాయి గింజల్లో ఔషధగుణాలు.. ఈ వ్యాధులకు చక్కటి నివారణ..!

Highlights

Health Tips: బొప్పాయి చాలా రుచికరమైన పండు. ఇది జీర్ణక్రియను సక్రమంగా చేస్తుంది. కానీ దీని గింజలను మనం చెత్తబుట్టలో వేస్తాము.

Health Tips: బొప్పాయి చాలా రుచికరమైన పండు. ఇది జీర్ణక్రియను సక్రమంగా చేస్తుంది. కానీ దీని గింజలను మనం చెత్తబుట్టలో వేస్తాము. ఎందుకంటే వీటి రుచి కొద్దిగా కారంగా, చేదుగా ఉంటుంది. ఇవి నల్ల మిరియాలలాగా ఉంటాయి. వీటిని సక్రమంగా ఉపయోగిస్తే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ విత్తనాలను ఎండలో ఎండబెట్టి పొడిగా మార్చాలి. ఈ పొడిని ఆహారంలో కలపవచ్చు లేదా మసాలాగా ఉపయోగించవచ్చు.

మెరుగైన జీర్ణక్రియ

బొప్పాయి గింజలు పపైన్ అని పిలువబడే ఒక ప్రత్యేక రకమైన ఎంజైమ్‌ను కలిగి ఉంటాయి. దీని సహాయంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. భోజనం తర్వాత ఒక చెంచా బొప్పాయి గింజల పొడిని తినాలి. ఇలా చేయడం వల్ల మలబద్ధకం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దరిచేరవు.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

బొప్పాయి గింజల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి పనిచేస్తుంది. ఈ గింజలను తినడం వల్ల జలుబు, దగ్గు, ఫ్లూ, వైరల్ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.

బరువు తగ్గుతారు

బొప్పాయి గింజలు తినడం వల్ల బరువు పెరగడాన్ని కంట్రోల్‌ చేయవచ్చు. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. నిజానికి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా మీరు అతిగా తినడం మానుకుంటారు.

క్యాన్సర్ నుంచి నివారణ

క్యాన్సర్ చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఇది కొన్నిసార్లు మానవుల ప్రాణాలను తీస్తుంది. దీనిని నివారించడానికి బొప్పాయి గింజలను క్రమం తప్పకుండా తినాలి. దీని గింజల్లో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉంటాయి. ఇది కొన్ని క్యాన్సర్ కణాల పెరుగుదలను నిలిపివేస్తుందని అనేక పరిశోధనల్లో రుజువైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories