Beauty Tips: రాత్రిపూట ఈ నూనెతో ముఖానికి మసాజ్‌ చేస్తే సూపర్ గ్లో..!

Massage Your Face With Coconut oil at Night for a Super Glow in the Morning
x

Beauty Tips: రాత్రిపూట ఈ నూనెతో ముఖానికి మసాజ్‌ చేస్తే సూపర్ గ్లో..!

Highlights

Beauty Tips: కాలాన్ని బట్టి మన ముఖ చర్మం భిన్నంగా స్పందిస్తుంది.

Beauty Tips: కాలాన్ని బట్టి మన ముఖ చర్మం భిన్నంగా స్పందిస్తుంది. అందుకే ప్రతి సీజన్‌లో చర్మంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేదంటే అది పొడిగా, నిర్జీవంగా కనిపిస్తుంది. మీరు ముఖంపై మచ్చలతో ఇబ్బందిపడుతుంటే కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. అలాగే ఆరోగ్యకరమైన చర్మానికి కొబ్బరి నూనెను ఉపయోగించడం చాలా మంచిది. కొబ్బరినూనె చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.

కొబ్బరినూనెలో యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఇది చర్మం వల్ల కలిగే సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. ఈ సహజ నూనెను అనేక రకాలుగా ఉపయోగిస్తారు. చాలా మంది దీనిని వంట నూనెగా ఉపయోగిస్తారు. దీన్ని ముఖ చర్మంపై రాసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని అరచేతికి నూనె రాసి మచ్చలపై రాసి కొద్దిసేపు మసాజ్ చేయాలి. తర్వాత రాత్రి మొత్తం అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల డార్క్ స్పాట్స్ పోయి చర్మం బిగుతుగా మారుతుంది.

ప్రతి రాత్రి కొబ్బరి నూనెతో ఈ విధంగా మసాజ్ చేయడం వల్ల చర్మంలో రక్త ప్రసరణ బాగా జరిగి దాని ప్రభావం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది. కొబ్బరినూనెను ముఖానికి పట్టించడం వల్ల ముఖంపై అద్భుతమైన గ్లో వస్తుంది. ముఖ చర్మం కూడా టోన్ అవుతుంది. కావాలంటే కొబ్బరినూనెలో నిమ్మరసం, గ్లిజరిన్, రోజ్ వాటర్ బాగా కలపండి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి తేలికపాటి చేతులతో మసాజ్ చేయండి. ఇప్పుడు అరగంట పాటు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. మంచి గ్లో వస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories