Health Tips: వంటగదిలోని ఈ ఆరు నూనెలు మరణానికి కారణం.. ఈ రోజే తొలగించండి..!

Many Diseases Including Cancer are Caused Due to use of Refined Oil Eliminate it Today
x

Health Tips: వంటగదిలోని ఈ ఆరు నూనెలు మరణానికి కారణం.. ఈ రోజే తొలగించండి..!

Highlights

Health Tips: శరీరాన్ని ఫిట్‌గా ఉంచడానికి, అంతర్గత అవయవాలను ఫ్లెక్సిబుల్‌గా ఉంచడానికి నూనె వాడటం అవసరం.

Health Tips: శరీరాన్ని ఫిట్‌గా ఉంచడానికి, అంతర్గత అవయవాలను ఫ్లెక్సిబుల్‌గా ఉంచడానికి నూనె వాడటం అవసరం. దీనివల్ల శరీరానికి అనేక విటమిన్లు అందుతాయి. అయితే అన్ని రకాల నూనెలు మన శరీరానికి మేలు చేసేవి కావు. మార్కెట్‌లో తక్కువ ధరకు విక్రయించే రిఫైన్డ్ ఆయిల్స్‌ చాలా ప్రమాదకరమైనవి. ఇందులో అనేక రసాయనాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని క్రమంగా బలహీనపరుస్తాయి. అందుకే అలాంటి రిఫైన్డ్ ఆయిల్స్‌కి దూరంగా ఉండటం అవసరం.

ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధిక ఉష్ణోగ్రత వద్ద శుద్ధి చేసి తర్వాత అందులో అనేక రకాల రసాయనాలను కలిపి రిఫైన్డ్‌ ఆయిల్స్‌ని తయారుచేస్తున్నారు. వీటికి వాసన, రచి ఉండదు. ఇలా తయారుచేయడం వల్ల సహజ నూనెలో ఉండే పోషకాలన్నీ నశించిపోయి శరీరంలో ట్రాన్స్ ఫ్యాట్ పెరగుతుంది. దీని కారణంగా అధిక కొలెస్ట్రాల్, ఇన్సులిన్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయి పెరుగుతుంది. అందుకే HDL కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

ఈ 6 రిఫైన్డ్ ఆయిల్స్‌ని వదిలేయండి

సోయాబీన్ నూనె, వేరుశెనగ నూనె, కనోలా నూనె, మొక్కజొన్న నూనె, పొద్దుతిరుగుడు నూనె, బియ్యం ఊక నుంచి తీసే నూనెలు వాడవద్దు. వీటివల్ల స్థూలకాయం, సంతానోత్పత్తి, క్యాన్సర్, గ్యాస్టార్, రోగనిరోధక శక్తి తగ్గడం, అథెరోస్క్లెరోసిస్ వంటి తీవ్రమైన వ్యాధులు సంభవిస్తున్నాయి. అందుకే వీలైనంత త్వరగా వీటిని వదిలేయడం మంచిది.

సహజ నూనెలు

శుద్ధి చేసిన నూనెకు బదులు ఆవనూనె, కొబ్బరినూనె, నువ్వుల నూనె లేదా దేశీ నెయ్యి వాడవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. శరీరం లోపల కూడా దృఢంగా మారుతుంది. ఈ సహజ నూనె శరీరంలో రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories