Mango Leaves: మామిడి ఆకులు మధుమేహ రోగులకి ఒక వరం.. ఎందుకంటే..?

Mango Leaves are a Boon for Diabetics
x

Mango Leaves: మామిడి ఆకులు మధుమేహ రోగులకి ఒక వరం.. ఎందుకంటే..?

Highlights

Mango Leaves: ఎండాకాలంలో మామిడిపండ్లు చాలా ఫేమస్‌.. అయితే మామిడి ఆకులు కూడా అంతే ఫేమస్.

Mango Leaves: ఎండాకాలంలో మామిడిపండ్లు చాలా ఫేమస్‌.. అయితే మామిడి ఆకులు కూడా అంతే ఫేమస్. ఎందుకంటే ఇందులో ఎన్నో ఔషధగుణాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా డయాబెటీస్‌ పేషెంట్లకి మామిడి ఆకులు ఒక వరమని చెప్పాలి. వీటిని ఉపయోగించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. అయితే వీటిని వాడే ముందు ఒకసారి వైద్యుడిని సంప్రదిస్తే మంచిది. ఇంతకీ ఇది డయాబెటీస్‌ పేషెంట్లకి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

మామిడి ఆకులలో పెక్టిన్, విటమిన్ సి, ఫైబర్ లభిస్తాయి. ఇది మధుమేహం, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు వీటిని తీసుకోవచ్చు. అదే సమయంలో బరువు తగ్గాలనుకునే వారు కూడా వీటిని ప్రయత్నించవచ్చు. ఈ కారణంగా మీ బరువు వేగంగా తగ్గుతుంది. కంటి చూపు సరిగా లేని వారు కూడా మామిడి ఆకులను తినవచ్చు. దీని వినియోగం కంటి చూపును పెంచడంలో సహాయపడుతుంది.

మామిడి ఆకులను ఎలా ఉపయోగించాలి..?

అన్నింటిలో మొదటిది, రోగులు 10-15 మామిడి ఆకులను తీసుకోవాలి. ఆ తర్వాత వాటిని నీటిలో సరిగ్గా ఉడకబెట్టాలి. రాత్రంతా అలాగే వదిలేయాలి. ఈ నీటిని ఉదయాన్నే వడకట్టి తాగాలి. పరగడుపున తాగాలని గుర్తుంచుకోండి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories