Taro Root Benefits: గుండెకు మేలు చేసే చామదుంప

Magical Health Benefits of Taro Root
x

Taro Root Benefits:(File Image)

Highlights

Taro Root Benefits: చామదుంపలో పిండి పదార్థం పీచు, యాంటీ ఆక్సిడెంట్ల కాంబినేషన్‌ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Taro Root Benefits: సాధారణంగా చాలా మంది దుంపలు అనగానే దానిలో పిండి పదార్థాలు ఎక్కువగా వుంటాయి అని వాటిని పక్కన పెడుతూవుంటారు. మరి కొందరు చామదుంప జిగురుగా వుంటాయని కూడా కొందరు వాటిని పట్టించుకోరు. దుంపల్లో ఒకటైన చామదుంప లో కూడా పిండి పదార్థం అధికంగానే వుంటుంది. కానీ దానిలో పిండి పదార్థం పీచు, యాంటీ ఆక్సిడెంట్ల కాంబినేషన్‌ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతే కాదండోయ్ మెనోపాజ్ దశ లో వున్న మహిళలకు ఎంతో మేలు చేస్తాయట. ఇలాంటి విషయాలను మన "లైఫ్ స్టైల్" లో తెలుసుకుందాం.

చేమ దుంపల్లో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇది గుండెకు మేలు చేస్తుంది. వీటిల్లో ఉండే పీచు, యాంటీ ఆక్సిడెంట్ల కాంబినేషన్‌ ధమనుల్లో కొవ్వు నిల్వ ఉండకుండా చేస్తుంది. వీటిల్లో ఉండే డియోస్కోరిన్‌ అనే ప్రోటీన్‌ గుండె జబ్బులూ, హార్ట్ ఎటాక్ రాకుండా కాపాడుతుంది. అంతేకాదు చేమదుంపల్లో విటమిన్‌ బి-6, 'ఇ' విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇక ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి.

మైనోపాజ్ దశలో ఉన్న మహిళలకు ఈ చేమ దుంపల వలన ఏంతో మేలు కలుగుతుంది. చేమ దుంపలు తినడం వలన మహిళలోని ఎండోక్రైన్‌ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. గర్భిణీలకు నీరు పట్టడం, వికారంగా ఉండే లక్షణాలను చామదుంపలు తగ్గిస్తాయి. హార్మోన్‌ రిప్లేస్‌ మెంట్‌ థెరపీకి చేమ దుంపలు ప్రత్యామ్నాయని అంటున్నారు. ఋతుసంబంధిత క్రాంప్స్‌, ఆర్థరైటిస్‌ నొప్పులు, కండరాల అలసట తగ్గించడానికి సహకరిస్తాయి. డయాబెటిస్ పేషెంట్లు చామ దుంపలని తీసుకోవడం వల్ల డైటరీ ఫైబర్ డైజేషన్ ప్రాసెస్ ని మెరుగు చేస్తుంది. దీని మూలంగా శరీరం లో ఇన్సులిన్ విడుదలను రెగ్యులేట్ చేయగలుగుతుంది.

క్యాన్సర్ తో ఇబ్బంది పడేవాళ్ళు లేదా క్యాన్సర్ రిస్క్ ఉన్న వాళ్ళు చామ దుంపను తీసుకోవడం వల్ల ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ బాగా సహాయం చేస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి కంటి ఆరోగ్యాన్ని మెరుగు పర్చడానికి కూడా ఇది బాగా ఉపయోగ పడుతుంది. చేమదుంపల్లో ఉండే ఫైబర్‌ మలబద్ధకాన్ని తగ్గించి, విష పదార్థాలు పేరుకుపోకుండా కాపాడుతుంది. కొలన్‌ క్యాన్సర్‌, ఇర్రిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ ల నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది.ముఖ్యంగా చేమ దుంపలను ఉడికించి తర్వాత వేయించి తింటే చాలా రుచిగా ఉంటాయి. అయితే ఎక్కువ మంది చేమదుంపలను మాంసానికి బదులు తింటారు. చూశారా చామదుంప వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో కదా...మరి ఇంకెందుకు ఆలస్యం చామ దుంపలను దొరికినపుడు వాడేసుకుందాం.

Show Full Article
Print Article
Next Story
More Stories